చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్..అరుణాచల్ ప్రదేశ్‌ భారత్ దే

చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్..అరుణాచల్ ప్రదేశ్‌ భారత్ దే

Phani CH

|

Updated on: Mar 21, 2024 | 7:15 PM

అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. బుధవారం జరిగిన పత్రికాసమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ టిబెట్ ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.

అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. బుధవారం జరిగిన పత్రికాసమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ టిబెట్ ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించారు. సైన్యాలను సరిహద్దులకు తరలించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే ఈ టన్నెల్‌కు భద్రతాకారణాల రీత్యా అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దక్షిణ చైనా తమ భూభాగమని పేర్కొంది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను తాము ఎన్నడూ గుర్తించలేదని కూడా చెప్పుకొచ్చింది. మరోవైపు, చైనా ప్రకటనపై భారత్ కూడా దీటుగా స్పందించింది. ఉత్తుత్తి పేర్లతో క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను మార్చలేరంటూ చైనా వ్యాఖ్యలను ఖండించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌

సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్న మనిషి మెదడులో అమర్చిన చిప్‌

మాల్టీతో అయోధ్యకు ప్రియాంక చోప్రా.. వీడియో ఇదిగో

ఆగిన పీటల మీది పెళ్లి !! అసలు కథ తెలిసి బంధువులంతా షాక్