Woman Scooty Stoped: దేశీ స్టైల్‌లో స్కూటీని ఆపాలనుకున్న మహిళ.. సీన్ రివర్స్..! చూస్తే నవ్వాగదు..వీడియో.
రోడ్డుపై వివిధ రకాలుగా డ్రైవింగ్ చేసేవారిని చూస్తూనే ఉన్నాం.. రోడ్డుపై రోజూ వేల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ప్రమాదాలు .. మనుషుల అవయవాలను, ప్రాణాలను కోల్పోయినట్లు చేస్తే..
రోడ్డుపై వివిధ రకాలుగా డ్రైవింగ్ చేసేవారిని చూస్తూనే ఉన్నాం.. రోడ్డుపై రోజూ వేల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ప్రమాదాలు .. మనుషుల అవయవాలను, ప్రాణాలను కోల్పోయినట్లు చేస్తే.. మరికొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తాయి. తాజాగా ఓ మహిళా బైక్ నడుపుతోన్న వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ మహిళ డ్రైవింగ్ చేస్తూ.. తన పాదాలను రోడ్డుపై ఈడ్చుతూ వెళ్తోంది. అలా కాళ్ళను రోడ్డుమీద పెట్టి.. తన స్కూటీ నడుపుతోంది. అలా ఆ యువతి నాలుగు రోడ్ల కూడలికి చేరుకోగానే.. కారు అడ్డంగా వచ్చింది. దీంతో కారుని ఢీ కొట్టకుంటూ తన స్కూటీని ఆపడానికి ఆమె.. బ్రేకులకు బదులుగా తన కాళ్లను ఉపయోగించింది. తన పాదాలతో స్కూటీని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అప్పడు స్కూటీ అదుపులోకి రాకపోవడంతో ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి బైక్‌పై వెళ్తున్న కొందరు కుర్రాళ్లు ఈ వీడియోను రికార్డ్ చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారింది.. ఆ యువతి డ్రైవింగ్ చూస్తుంటే.. స్కూటీ హ్యాండ్ బ్రేక్ గురించి అస్సలు తెలియదని.. అందుకే స్కూటీని కాళ్లతో ఆపివేయాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos