Misss World:‘ప్రియాంక అందగత్తె కాదు.. రిగ్గింగ్ చేసి గెలిచింది..!’: మాజీ సుందరి ఆరోపణ..వీడియో.
గ్లోబల్ స్టార్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మిస్ బార్బడోస్ లెయ్‌లానీ మెకనీ. ప్రపంచ సుందరి కిరీటాన్ని ప్రియాంక రిగ్గింగ్ చేసి సొంతం చేసుకుందని ఆమె అన్నారు.
” మిస్ బార్బడోస్‌గా నేను 2000లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్నాను. ఆ ఏడాది మిస్ ఇండియా ప్రియాంక చోప్రా కిరీటాన్ని సొంతం చేసుకుంది. 1999, 2000.. ఇలా రెండేళ్ల పాటు ప్రపంచ సుందరి కిరీటం భారతదేశానికే దక్కడానికి స్పాన్సర్లే కారణం. ఎందుకంటే ఆ సంస్థ ఇండియాకు చెందినది. ముఖ్యంగా ప్రియాంకకు అక్రమంగా కిరీటం వరించింది. ఆమె అందగత్తె కాదు. రిహార్సల్స్‌లోనూ పాల్గొనలేదు. మధ్యాహ్నం పూట భోజనం కూడా ఆమె రూమ్‌కే వెళ్లేది. కానీ మిగిలిన వాళ్లందరికీ, అలా కాదు. ఆమెకు ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేశారు. బీచ్‌లోనూ ఆమెకు స్పెషల్‌గా ఫొటోలు తీసి పేపర్లలో వచ్చేలా చేశారు. మిగిలిన వాళ్లందరినీ గుంపుగా తీశారు. ఇలా ఆ ఏడాది ప్రపంచ సుందరి పోటీల్లో ఫేవరెటిజం ప్రదర్శించారు” అని ఆరోపణలు చేసింది. మిస్ యూఎస్‌ఏ పోటీలకు సంబంధించిన వివాదం గురించి మాట్లాడుతూ లెయ్‌లానీ తాజాగా ఈ వీడియో షేర్ చేసింది. స్పాన్సర్ వల్లే మిస్ టెక్సాస్ ఆర్‌బానీ గాబ్రియేల్‌కు మిస్ యూఎస్‌ఏ కిరీటం వచ్చిందంటూ పోటీల్లో పాల్గొన్న ఇతర కంటెస్టెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన లెయ్‌లానీ.. 2000 ప్రపంచ సుందరి పోటీల్లోనూ ఇలాగే జరిగిందంటూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని ప్రియాంకపై ఆరోపణలు చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

