AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Volcano Eruption: 50 ఏళ్ల తర్వాత పేలిన అగ్ని పర్వతం.. ఇళ్లల్లోకి వచ్చిన లావా.. 100 ఇళ్లు ధ్వంసం

Volcano Eruption in Spain: 50 ఏళ్ల నుంచి నివురుగప్పిన నిప్పుల కొండలా ఉన్న ఆ అగ్ని పర్వతం ఒక్కసారిగా పేలిపోయింది. ఒకటి కాదు.. రెండు క్రేటర్ల నుంచి దాదాపు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల..

Volcano Eruption: 50 ఏళ్ల తర్వాత పేలిన అగ్ని పర్వతం.. ఇళ్లల్లోకి వచ్చిన లావా.. 100 ఇళ్లు ధ్వంసం
Follow us
Subhash Goud

|

Updated on: Sep 22, 2021 | 4:16 PM

Volcano Eruption in Spain: 50 ఏళ్ల నుంచి నివురుగప్పిన నిప్పుల కొండలా ఉన్న ఆ అగ్ని పర్వతం ఒక్కసారిగా పేలిపోయింది. ఒకటి కాదు.. రెండు క్రేటర్ల నుంచి దాదాపు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల లావాను, బూడిదను వందల మీటర్ల ఎత్తుకు ఎగజిమ్మింది. కనీవినీ ఎరుగని రీతిలో బయటకు ఎగజిమ్ముకొస్తున్న లావా.. భగభగ మండుతున్న 8 నదుల్లా మారి కింద ఉన్న గ్రామాలపైకి దూసుకొస్తోంది. గడ్డీ గాదం, చెట్టూ పుట్టా, ఇండ్లూ రోడ్లూ.. అడ్డొచ్చిన ప్రతిదీ బూడిదే అయిపోయింది. ఇప్పటికే 100 ఇళ్లకుపైగా లావాకు ఆహుతైపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గామారింది. వేలాది మంది జనం ఇళ్లు వదలి వెళ్లిపోయారు. అట్లాంటిక్ సముద్రంలోని స్పెయిన్ కు చెందిన లా పాల్మా ఐల్యాండ్ లో ఆదివారం మొదలైన బీభత్సం సృష్టించింది. ఐల్యాండ్ లోని కంబర్ వీజా అగ్నిపర్వతం ప్రాంతంలో గత వారంరోజుల్లోనే 25 వేల భూకంపాలు వచ్చాయట. దీంతో భూమిలోని ఫాల్ట్ ల గుండా మాగ్మా, గ్యాస్ లు పైకి తన్నుకొచ్చినయి. తీవ్రమైన ప్రెజర్ పెరగడంతో అగ్నిపర్వతం ఆదివారం ఒక్కసారిగా బద్దలైపోయింది. అడవులను దహించేసింది..

కొండపై అడవిని దహించివేస్తూ.. లావా ప్రవాహాలు కిందకు వస్తున్న మార్గాల్లోని ఇండ్లలో ఉన్న 5 వేల మందిని, పలు హోటళ్లలో ఉన్న చాలా మంది టూరిస్టులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ఇప్పట్లో లావా ప్రవాహం నిలిచిపోయే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదని, సుమారు రెండు నెలల పాటు లావా ఎగజిమ్ముతూనే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో అగ్నిపర్వతం పైనుంచి కిందకు వస్తున్న లావా నదులు.. సముద్రంలోకి కలిసే మార్గంలో ఇంకెన్ని ఇండ్లను బూడిద చేస్తాయోనన్న ఆందోళనలు చెందుతున్నారు.

స్పానిష్ కానరీ దీవుల్లో 1971 వ సంవత్సరం తర్వాత అగ్నిపర్వతం పేలుడు సంభవించింది. అగ్నిపర్వతం నుంచి వెదజల్లుతున్న లావాను డ్రోన్ ఫుటేజ్ తాజాగా వెలుగుచూసింది. లావా ప్రవాహం స్విమ్మింగ్ పూల్‌ను ముంచెత్తిన వీడియో వైరల్ అయింది. అగ్నిపర్వతం పేలుడు అనంతరం లావా ప్రవాహం వల్ల 100 ఇళ్లు ధ్వంసం కాగా, 5,500 మంది ప్రజలను ఖాళీ చేయించారు. అగ్నిపర్వతం పేలుడు ఘటన చూసి భూకంపం వచ్చిందని భావించామని ఆస్ట్రియాకు చెందిన ఎవా అనే టూరిస్టు చెప్పారు.

ఇవీ కూడా చదవండి:

Train Ticket: రైలు టికెట్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రూ.10 లక్షల వరకు బెనిఫిట్స్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Bank New Rules: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? ఈ విషయాలు తెలుసుకోండి.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న నిబంధనలు

ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్
వారమంతా చికెన్ లాగించేస్తున్నారా.. ఈ రిస్క్ ఉంది జాగ్రత్త!
వారమంతా చికెన్ లాగించేస్తున్నారా.. ఈ రిస్క్ ఉంది జాగ్రత్త!
ట్రెండింగ్‌లో 'ఆవిడే మా ఆవిడే' సెకెండ్ హీరోయిన్?ఇప్పుడెలా ఉందంటే?
ట్రెండింగ్‌లో 'ఆవిడే మా ఆవిడే' సెకెండ్ హీరోయిన్?ఇప్పుడెలా ఉందంటే?
30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా.?
30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా.?
చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ
సీఐ కోసం జట్లు పట్టుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు
సీఐ కోసం జట్లు పట్టుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు