యువతిని చంపేందుకు, బొమ్మ బొరుసు ఆట..చివరకు!
మనిషిలోని ‘మృగం’ మేల్కొంటే ఎంతటి ఘోరానికైనా తెగిస్తాడు. లైంగిక దాడుల విషయంలో దారుణాలను నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడో కేసులో నిందితుడు నేరానికి పాల్పడిన తీరు, కారణం విని.. న్యాయమూర్తితో సహా అందరినీ విస్తుపోయేలా చేశాయి. 18 ఏళ్ల ఓ యువతి నైట్‌క్లబ్‌లో తన స్నేహితులతో పార్టీ ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తోంది. ఆ టైంలో ఓ కుర్రాడి కళ్లు ఆమె మీద పడ్డాయి. ఆమె కూడా అతనితో మాటలు కలిపింది. అర్ధరాత్రి దాటడంతో.. తన ఇంటికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు. అయితే అమాయకంగా అతని వెంట వెళ్లడం ఆమె పాలిట శాపమైంది. కొన్నిరోజుల తర్వాత.. ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఆమె శవంగా కనిపించింది. శవపరీక్షలో.. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు తేలింది. అంతేకాదు ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.
మృతురాలిని మిస్సింగ్ కేసు ద్వారా పోల్చుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు.. చివరకు ఆ రాత్రి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి మరీ బలిగొన్న యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలాండ్ నగరం కటోవీస్‌లో జరిగిన దారుణ ఘటన ఇది. కేసు విచారణలో భాగంగా నిందితుడ్ని జనవరి 8వ తేదీన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ముందు నేరం అంగీకరిస్తూ అతను చెప్పిన వివరాలు ఏంటంటే..ఇద్దరికీ బస్సులో పరిచయమైంది. కాసేపు ఇద్దరం మాటలు కలిపారు. ఆ తరవాత ఇంటికి వెళ్లారు. ఉన్నట్టుండి ఆమె పక్కకు వాలిపోయింది. నిద్ర లేపేందుకు యత్నించినా ఆమె లేవలేదు. తన చేతిలో ఉన్న కాయిన్‌ను ఎగరేసి బొమ్మ పడితే చంపేయాలి అనుకున్నాననీ బొరుసు పడితే ప్రాణాలతో వదిలేయాలనుకున్నట్లు చెప్పాడు. ఆమె దురదృష్టం బొమ్మ పడిందనీ అందుకే ఆమెను చంపేశాననీ అన్నాడు. అలా ఎందుకు చేశానో తనకు తెలియదనీ అది అలా జరిగిపోయిందంతే.. అన్నాడు.
మరిన్ని వార్తలకోసం :
రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయుడు మృతి.. అసలు కథ ఇది!
కుంభమేళాలో సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్..సీన్ కట్ చేస్తే..
సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

