ముంబయి ఐఐటీలో ఇంజనీరింగ్.. అన్నీ వదిలేసి బాబా అవతారం
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు సాధువులు, నాగసాధువులు, అఘోరాలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మహాకుంభానికి వచ్చిన కొందరు సాధువులు తమ విచిత్ర వేషధారణ, ఆహార్యం, అలవాట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో IIT బాబాగా మారిన ఒక సన్యాసి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఐఐటీ ముంబయ్‌లో ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివి బాబాగా ఎలా మారాడన్న విషయం ఆసక్తిగా మారింది. హర్యానాకు చెందిన ఐఐటీ బాబా అసలు పేరు అభయ్ సింగ్. అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో నాలుగేళ్లు ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇంజినీరింగ్ చదివే సమయంలోనే కొన్ని ఫిలాసఫీ కోర్సులు, పోస్ట్ మాడర్నిజం, సోక్రటీస్, ప్లేటో గురించి చదివానని ఐఐటీ బాబా చెబుతున్నాడు. తరువాత ఆర్ట్స్‌పై ఆసక్తితో డిజైనింగ్‌లో మాస్టర్స్ చేశాడు. ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవాలనే జిజ్ఞాసతో బాబాగా మారి, శివునికి తన జీవితాన్ని అంకితం చేశానని చెప్పాడు. సన్యాసిగా ఉండటమే తన జీవితంలో బెస్ట్ స్టేజ్ అని సమాధానమిచ్చాడు. మీరు ఎంత దూరం వెళ్లినా చివరికి మీరు ఈ ప్రదేశానికి రావాల్సిందేనని సందేశమిస్తున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రెండ్ ఫ్రెండే..లెక్క లెక్కే.. ఫుడ్ బిల్‌ని పక్కాగా పంచిన సీఏ
అయ్యబాబోయ్.. ఆ ఇంటి ఒక్క నెల కరెంట్ బిల్లు అక్షరాలా.. రూ.210 కోట్లా
కోహ్లీకి ఆ ఇన్నింగ్స్ చూపిస్తే చాలు.. ఇక ఎవరూ ఆపలేరు
అతన్ని చూడగానే తోకముడిచి పారిపోయిన సింహం !!
లైటర్ ఇచ్చేందుకు ఆకాశంలో నుంచి వచ్చాడు.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్

సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ

కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..

బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసాడని 100 డైల్ చేసిన గర్ల్ ఫ్రెండ్..

భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే..

భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో

దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో

రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్, కానీ జీవితం కోల్పోయిన టెకీ ..
