అయ్యబాబోయ్.. ఆ ఇంటి ఒక్క నెల కరెంట్ బిల్లు అక్షరాలా.. రూ.210 కోట్లా
ఏ ఇంటికైనా సాధారణంగా కరెంటు బిల్లు ఎంత వస్తుంది. మధ్య తరగతి ఇంటికైతే నెలకు రూ.500. కాస్త ఇంట్లో టీవీతో ఫ్రిజ్, ఏసీ వంటి సౌకర్యాలు ఉంటే.. మహా అయితే రూ.1000 లేదంటే రూ.1500లోపు వస్తుంది. అంతకు మించి దాదాపుగా రాదు. అదే ఏదైనా షాపో, హోటలో, ఫ్యాక్టరీ వంటి వాటికైతే నెలకు రూ.5 వేల నుంచి 8 వేల వరకూ వచ్చే అవకాశం ఉంది.
అయితే ఓ వ్యక్తి ఇంటికి ఒక నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.200 కోట్లు వచ్చింది. దీంతో బిల్లు చూసిన సదరు వ్యక్తికి దెబ్బకు మూర్చపోయాడు. ఈ షాకింగ్ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని బెహెర్విన్ జట్టన్ గ్రామానికి చెందిన లలిత్ ధీమాన్ అనే ఓ వ్యాపారవేత్తకు సొంతిల్లు ఉంది. అతడికి ప్రతీనెలా రూ.2 వేలకు అటు ఇటుగా కరెంట్ బిల్లు వస్తుంటుంది. గత నవంబర్ నెలలో రూ.2,500 కరెంట్ బిల్లు చెల్లించాడు. అయితే తాజాగా డిసెంబర్ 2024 నెలకి సంబంధించిన కరెంటు బిల్లు వచ్చింది. బిల్లుపై ఏకంగా రూ.210,42,08,405 ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఒక్క నెలకు ఇన్ని వందల కోట్ల బిల్లు రావడం ఏంటని ఆందోళన చెందాడు. వెంటనే కరెంట్ ఆఫీసుకు పరిగెత్తాడు. అక్కడి అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు బిల్లును పరిశీలించి సాంకేతిక లోపం కారణంగా అధిక విద్యుత్ బిల్లు వచ్చినట్లు గుర్తించారు. డిసెంబర్ నెల కరెంట్ బిల్లు రూ.4,047గా నిర్ధారించి మరోబిల్లు చేతిలో పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోహ్లీకి ఆ ఇన్నింగ్స్ చూపిస్తే చాలు.. ఇక ఎవరూ ఆపలేరు
అతన్ని చూడగానే తోకముడిచి పారిపోయిన సింహం !!
లైటర్ ఇచ్చేందుకు ఆకాశంలో నుంచి వచ్చాడు.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
షాపింగ్ మాల్‌లో కోతి హంగామా.. ఓ యువతి తలపైకి ఎక్కి..
కూతురి పెళ్లిని పీటల మీదే ఆపేసిన తల్లి.. విషయం తెలిసి అంతా షాక్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

