Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీకి ఆ ఇన్నింగ్స్ చూపిస్తే చాలు.. ఇక ఎవరూ ఆపలేరు

కోహ్లీకి ఆ ఇన్నింగ్స్ చూపిస్తే చాలు.. ఇక ఎవరూ ఆపలేరు

Phani CH

|

Updated on: Jan 18, 2025 | 1:31 PM

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ కొద్ది రోజులుగా పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. విరాట్‌ విశ్వరూపం వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలోనైనా చూడగలమా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో దుబాయ్‌ వేదికగా ఫిబ్రవరి 23న ఆడనుంది.

ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీ గురించి పాక్‌ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే.. పాక్‌పై మెల్‌బోర్న్‌ ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తే సరిపోతుందని షోయబ్‌ అక్తర్‌ కామెంట్స్‌ చేశాడు. అదే అతడికి మేలుకొలుపు అవుతుందని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌ 2022 టోర్నీలో భారత్ – పాకిస్థాన్‌ మ్యాచ్‌ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ 4 పరుగులు, కేఎల్ రాహుల్ 4 పరుగులే చేసి విఫలమైనప్పటికీ.. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ 82 పరుగులు చేసి ఆఖరి బంతి వరకూ క్రీజ్‌లో ఉన్నాడు. హార్దిక్‌ పాండ్య కూడా 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓ వైపు వికెట్లు పడినా పాక్‌ బౌలర్లకు కోహ్లీ కొరకరాని కొయ్యలా మారాడు. పాక్‌ బౌలర్లూ రాణించడంతో భారత్‌ ఛేదన కష్టంగా మారింది. కానీ, విరాట్ మాత్రం పట్టువదల్లేదు. భారత్‌ కూడా సరిగ్గా 20 ఓవర్లలో 160 పరుగులు చేసి విజయం సాధించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతన్ని చూడగానే తోకముడిచి పారిపోయిన సింహం !!

లైటర్‌ ఇచ్చేందుకు ఆకాశంలో నుంచి వచ్చాడు.. ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్న నెటిజన్స్‌

షాపింగ్‌ మాల్‌లో కోతి హంగామా.. ఓ యువతి తలపైకి ఎక్కి..

కూతురి పెళ్లిని పీటల మీదే ఆపేసిన తల్లి.. విషయం తెలిసి అంతా షాక్‌

ప్రాంక్‌ అని చెప్పి నిజమైన పెళ్లి! కోర్టుకెక్కిన మహిళ