ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి! కోర్టుకెక్కిన మహిళ
రీల్స్, ఇన్‌స్ట్రాగామ్ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఆ్రస్టేలియాలోని ఓ మహిళకు ఇలాంటి సమస్యే ఎదురైంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ‘ఫేక్ వెడ్డింగ్’నిజమని తేలడంతో ఆమె కోర్టుకెక్కాల్సి వచ్చింది. చివరకు జడ్జి ఆ పెళ్లిని రద్దు చేశారు.
వివరాల్లోకి వెళ్తే… మెల్‌బోర్న్‌లో ఉంటున్న ఓ మహిళకు 2023 సెప్టెంబర్‌లో ఆన్‌లైన్ డేటింగ్ వేదికపై ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది డిసెంబర్‌లో ఆమెకు అతను ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది. రెండు రోజుల తర్వాత సిడ్నీలో ఓ వైట్‌పార్టీ ఉందని, అక్కడికి అందరూ తెలుపు రంగు దుస్తుల్లో వస్తారని చెప్పారు. ఆమె కూడా అలాగే రెడీ అయి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే.. ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ స్నేహితుడు తప్ప మరెవరూ లేరు. ఇదేంటని ప్రశ్నిస్తే… తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్స్ పెరగడం కోసం ప్రాంక్ వెడ్డింగ్ నిర్వహిస్తున్నానని, అందుకు సహకరించాలని ఆమెను కోరాడు. అప్పటికే అతనికి 17,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతని వివరణ ఆమెకు సబబుగానే తోచింది. సాయం చేసినట్లవుతుందని ఫేక్ పెళ్లికి అంగీకరించింది. సివిల్ మ్యారేజ్ కోర్టులో జరిగితేనే పెళ్లి చెల్లుబాటవుతుందని నమ్మింది. అదే విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకుంది. అదే నిజమైతే వారు ముందుగా వివాహం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్నేహితురాలు కూడా చెప్పడంతో.. ఇది ఉత్తుత్తి పెళ్లే అని నమ్మింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

