గుంపుగా వెళుతున్న ఏనుగుల్లో ఒకదానిని రెచ్చగొట్టిన యువకుడు
అక్కడో ఏనుగుల గుంపు వెళుతోంది. అందులో ఒక గున్న ఏనుగును ఓ యువకుడు కావాలని రెచ్చగొట్టాడు. దానికి దగ్గరగా వెళుతూ, చేతులు ఊపడం మొదలుపెట్టాడు. దీనితో చిరాకెత్తిన ఏనుగు అతడి వెంటపడింది. కొంత దూరం వెళ్లాక.. పోనీలే అన్నట్టుగా ఏనుగు వెనుదిరిగింది. అయినా ఆ యువకుడు ఊరుకోకుండా... మళ్లీ ఆ ఏనుగును రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు.
మళ్లీ అతడి వెంటపడేందుకు ప్రయత్నించిన ఏనుగు… వదిలేసి.. తన గుంపుతో కలసి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఇలాంటి తీరు సరికాదని అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. కొన్ని గంటల్లోనే నాలుగు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఏనుగును రెచ్చగొట్టిన యువకుడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున ఆ ఏనుగు మరెవరిపై అయినా దాడి చేస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోలోని యువకుడిని గుర్తించి శిక్షించాలని, మరొకరు ఇలా వ్యవహరించకుండా చేయాలని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ పప్పులను దూరం పెట్టాలి!
ప్రాణాంతక వైరస్‌లను ముందే పసిగట్టి AI .. రాబోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందా?
ఏం యాక్టింగ్ చేశావే మొసలి..! మనుషులను తినేయడానికి మాస్టర్ ప్లాన్
అమ్మ కోసం విమానాన్నే ఆపించిన మహిళ..!
గ్యాస్ స్టవ్ ఆపకుండా నిద్రపోయిన స్నేహితులు.. తెల్లారేసరికి..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

