షాపింగ్ మాల్‌లో కోతి హంగామా.. ఓ యువతి తలపైకి ఎక్కి..
ఓ కోతి షాపింగ్‌మాల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎలా వచ్చిందో ఏమో కానీ ఆ షాపింగ్ మాల్‌లోకి వెళ్లి నానా హంగామా చేసింది. అటూ ఇటూ గెంతుతూ..అక్కడి జనాలను, సిబ్బందిని పరుగులు పెట్టించింది. ఏకంగా ఓ మహిళ తలపైకి ఎక్కి కూర్చుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. నగరంలోని సిటీ కార్ట్‌మాల్‌లోకి ప్రవేశించిన కోతి అక్కడ గందరగోళం సృష్టించింది.
మాల్ లోని బట్టలు ఇతర సామాగ్రి లాగి కిందపడేసి నానా హంగామా చేసింది. కోతి ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని కొందరు అటూ ఇటూ పరుగులు తీశారు. మరికొందరు దానికి తినడానికి ఏమైనా ఇస్తే బయటకు వెళ్లిపోతుందని భావించి దానికి పండ్లు అందించారు. అయినా ఆ కోతి వెళ్లలేదు. అక్కడే ఉన్న ఓ యువతి తలపైకి ఎక్కి ఆమె తలలో పేలు చూసింది. కొందరు దుప్పట్లతో కోతిని పట్టుకోడానికి ట్రైచేశారు. కానీ కోతి వారి నుంచి తప్పించుకుంటూ చుక్కలు చూపించింది. ఆ కోతి వారికి చిక్కకుండా మాల్‌లోని స్టాండ్‌లపై గెంతులేస్తూ గందరగోళం సృష్టించింది. సిబ్బందిని పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతురి పెళ్లిని పీటల మీదే ఆపేసిన తల్లి.. విషయం తెలిసి అంతా షాక్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

