అతన్ని చూడగానే తోకముడిచి పారిపోయిన సింహం !!
సింహాన్ని అడవికి రాజుగా చెబుతారు. సింహం రాజసం అలాంటిది. సింహం గర్జిస్తే చాలు మిగతా జంతువులు ఎక్కడివక్కడ గప్‌చుప్. ఇక మనుషుల సంగతి చెప్పనక్కర్లేదు. అలాంటి సింహం ఓ వక్తిని చూసి తోక ముడిచి పారిపోయింది. అతను ఆ సింహాన్ని ఓ కుక్కనో, పిల్లినో తరిమినట్టు తరమడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఓ ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక వ్యక్తి కొన్ని అడుగుల దూరం నుండి చేతిలో కర్రను చూపుతూ సింహాన్ని తరిమికొడుతున్నాడు..ఈ షాకింగ్ దృశ్యం గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జరిగినట్టుగా తెలిసింది. అక్కడ ఒక సింహం రైల్వే క్రాసింగ్ దగ్గర ట్రాక్ దాటుతోంది. అదే సమయంలో ఓ వ్యక్తి కూడా ఆ ట్రాక్‌పై నడిచి వెళ్తున్నాడు. మరోవైపు ట్రాక్‌పై రైలు కూడా రాబోతుంది. అది గమనించిన ఆ వ్యక్తి సింహాన్ని రక్షించాలనుకున్నాడు. వెంటనే తన చేతిలో ఉన్న చిన్న కర్రతో ఆ సింహాన్ని బెదిరించాడు. చేతిలో చిన్న కర్ర పట్టుకుని ఓ ఆవు, మేక, ఎద్దును తరిమినట్టుగా దూరంగా దానిని తోలుతున్నాడు. దాంతో ఆ సింహం కూడా అతనికి భయపడి దూరంగా పరిగెత్తుకెళ్లిపోయింది. ఈ సమయంలో రైల్వే గేట్ తెరవడానికి వేచి ఉన్న వ్యక్తులు ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను వీడియో తీశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లైటర్ ఇచ్చేందుకు ఆకాశంలో నుంచి వచ్చాడు.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
షాపింగ్ మాల్‌లో కోతి హంగామా.. ఓ యువతి తలపైకి ఎక్కి..
కూతురి పెళ్లిని పీటల మీదే ఆపేసిన తల్లి.. విషయం తెలిసి అంతా షాక్
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

