Viral Video: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది.. మీరు మాత్రం ఇలా ట్రై చేయకండి.. వైరలవుతోన్న బైక్ స్టంట్ వీడియో
ఓ వ్యక్తి బైక్‌తో విన్యాసాలు చేస్తుండగా, అకస్మాత్తుగా రెండుగా చీలిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

Trending Video: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం తమాషా వీడియోలను ఒక్కొక్కటిగా నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. వీటిలో కొన్ని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటాయి. వీటిల్లో ప్రతిరోజూ సోషల్ మీడియాలో కొన్ని బైక్ స్టంట్స్ వీడియోలను తప్పక ఉంటాయి. ప్రస్తుతం వీడియోలో ఓ వ్యక్తి బైక్‌పై విన్యాసాలు చేస్తున్నట్లు చూడొచ్చు.ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యంతో పాటు నవ్వుకుంటారు.
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘@HldMyBeer’ పేరుతో నెట్టింట్లోకి వదిలారు. ఖాళీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి బైక్‌తో విన్యాసాలు చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. స్టంట్ చేస్తున్న సమయంలో తన బైక్‌ను గాలిలో లేపేందుకు ప్రయత్నించాడు. అంతే అకస్మాత్తుగా బైక్ మధ్యలో విరిగిపోయి రెండుగా చీలడంతో బండితోపాటు ఆ వ్యక్తి కూడా కింద పడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
నెటిజన్లకు ఈ వీడియో ఎంతగానో నచ్చింది. దీన్ని మళ్లీ మళ్లీ చూసేందుకు ఇష్టపడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోను ఇప్పటివరకు 43 వేల మందికి పైగా చూశారు. 13 వందల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో వీడియోను ఆస్వాదిస్తూ ఫన్నీ రియాక్షన్లు కూడా ఇస్తున్నారు. ‘బ్రదర్, స్టంట్స్ సూపర్ చేశావ్’ అని ఓ యూజర్ అంటే, ‘ఈ స్టంట్ చాలా ఫన్నీగా ఉంది’ అని మరొక యూజర్ కామెంట్ చేశాడు.
Was wondering where the extra screws were from? ?? pic.twitter.com/eg6TDH00t5
— ? Hold My Beer ? (@HldMyBeer) November 7, 2021
Also Read: Viral Video: ‘ఉన్నదాంట్లో హ్యాపీగా బ్రతకడమే జీవితం’.. గొప్ప సందేశాన్నిస్తున్న వెడ్డింగ్ వైరల్ వీడియో
Viral Video: ‘ఫోన్ నాదంటే.. నాది’.. చిన్నారి వర్సెస్ వానరం.. క్యూట్ వీడియో భలే ఉంది