Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మగ సింహంపై విరుచుకుపడ్డ రెండు ఆడ సింహాలు.. యుద్ధం మాములుగా లేదు.. చూస్తే షాకవుతారు!

అడవికి రారాజైన సింహం వస్తోందంటే చాలు జంతువులన్నీ భయంతో పరుగులు పెడతాయి. దాని గర్జన వినిపించినా కూడా మిగతా...

Viral Video: మగ సింహంపై విరుచుకుపడ్డ రెండు ఆడ సింహాలు.. యుద్ధం మాములుగా లేదు.. చూస్తే షాకవుతారు!
Lion
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 11, 2021 | 10:46 AM

అడవికి రారాజైన సింహం వస్తోందంటే చాలు జంతువులన్నీ భయంతో పరుగులు పెడతాయి. దాని గర్జన వినిపించినా కూడా మిగతా జంతువులు ఠక్కున దాక్కుంటాయి. ఇక సింహం పంజా ఎలాంటిదో చూపిస్తూ అనేక వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి.  మరి అంతటి బలశాలి అయిన సింహం మరో జంతువును చూసి భయపడుతుంది. ఎవరని ఆలోచిస్తున్నారా.? అది ఎవరో కాదు సింహం భార్య. ఏ మగ సింహం అయినా కూడా ఆడ సింహాన్ని చూసి భయపడాల్సిందే. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ మగ సింహంపై రెండు ఆడ సింహాలు విరుచుకుపడినట్లు మీరు చూడవచ్చు. వాటి నుంచి మగ సింహం తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. అయితే ఆడ సింహాలు మాత్రం దాన్ని వదల్లేదు. వెంటపడి మరీ కోపంతో దానిపై గర్జిస్తాయి. అసలు వాటి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ మగ సింహాన్ని.. ఆ రెండు ఆడ సింహాలు తరిమి తరిమికొట్టాయి.

కాగా, 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ‘darksideofnature’ అనే ట్విట్టర్ పేజి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇప్పటిదాకా ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియో 1.5 వేల లైకులు రాబట్టింది. ”మగ సింహం మోసం చేసి ఉంటుంది. అందుకు శిక్ష అనుభవిస్తోంది” అని ఒకరు కామెంట్ చేయగా.. ”ఇది వాళ్ల కుటుంబ సమస్య’ అయి ఉండొచ్చునని మరొకరు కామెంట్ చేశారు. ఇలా చాలామంది ఫన్నీ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

Also Read:

3 మ్యాచులు.. 23 బంతులు.. అత్యధిక స్కోర్ 27 పరుగులే.. అయినా ఐసీసీ గౌరవించింది.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టీ20 జట్టులో కోహ్లీ స్నేహితుడికి నో ప్లేస్.. లిస్టులో మరో ఐదుగురు.!

Viral Video: ఇదేం క్రియేటివిటీ మావా.. ఈ వ్యక్తి చేసిన ఇన్వెన్ష‌న్‌కు ఇంజనీర్లు సైతం షాకవుతారు.!

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా ఎమోషనల్.. కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేరు.. ఆ రాశులేంటి.!