Viral Video: సిమ్లాలో విరిగిపడిన కొండచరియలు.. క్షణంలో తప్పిన ముప్పు.. చూస్తుండగానే ఒళ్లు గగుర్పొడిచే సీన్!

| Edited By: Anil kumar poka

Sep 06, 2021 | 9:33 PM

Shimla Landslide: హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Viral Video: సిమ్లాలో విరిగిపడిన కొండచరియలు.. క్షణంలో తప్పిన ముప్పు.. చూస్తుండగానే ఒళ్లు గగుర్పొడిచే సీన్!
Shimla Landslide
Follow us on

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిమ్లా జిల్లాలోని జియోరి వద్ద హైవేపై సోమవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. 5 వ నెంబర్ జాతీయరహదారిపై ఘటన చోటుచేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. దీంతో స్పాట్‌కు చేరుకన్న ఆర్మీ, NDRF సిబ్బంది సహాయకచర్యలు ముమ్మరం చేశాయి. కొండపై నుంచి రాళ్లు పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

అయితే, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిసిన సిమ్లా జిల్లా యంత్రాంగం ముందస్తుగా పాయింట్ వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. అయితే, రాళ్లు, మట్టి దిబ్బలు ఎగిరి పడటం వల్ల కొన్ని వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధికారుల ప్రకారం.. సిమ్లాజిల్లాలోని రాంపూర్ సబ్ డివిజన్‌లోని జియోరి ప్రాంతంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో NH-5 రహదారిపై పూర్తిగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

మరోవైపు, జిల్లాయంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తోంది. SDM- రాంపూర్, పోలీసులు, ప్రత్యేక బృందాలను నియమించారు. కొండచరియలు విరిగిపడిన తరువాత, జాతీయ రహదారి అధికారులు రోడ్డుపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్దరించారు. అయితే, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం కంటిన్యూగా మంచు, వర్షం కురుస్తూ ఉంటాయి. ఫలితంగా చాలా చోట్ల రోడ్లు దెబ్బతింటాయి. ఒక్కోసారి కొండరాళ్లు విరిగి రోడ్డుపై పడుతుంటాయి. ఆ సమయంలో అక్కడ వాహనదారులు ఉంటే… ప్రాణాలకే ప్రమాదం.

తాజాగా సిమ్లాలో అలాంటి ఓ ఘటన వాహనదారులకు వణుకు పుట్టించింది. నేషనల్ హైవేపై వాహనాలు వెళ్తుండగా… జ్యోతి ఏరియాలో ఒక్కసారిగా కొండరాళ్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై చాలా వాహనాలున్నాయి. వారంతా అప్రమత్తంపై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కొందరేమో… వాహనాల్లోంచి దిగి రోడ్డుపై పరుగులు పెట్టారు. మరికొందరు ఆ బండరాళ్లు పడిపోతుంటే వీడియోలు తీశారు. అయితే, బండరాళ్లు రోడ్డుపై పడటంతో… ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడి నెట్టింట్లో వైరల్‌గా మారింది..

హిమాచల్ ప్రదేశ్‌లో ఇలాంటివి చాలా ఘటనలు సర్వసాధారణంగా జరుగుతాయి. ఆ మధ్య జులై 25న సంగ్లాలోని చిత్కూల్ రూట్ కిన్నార్ దగ్గర ఇలాగే కొండరాళ్లు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఓ పర్యాటకుల వాహనంపై రాళ్లు పడటంతో 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. గత నెలలో కిన్నార్ జిల్లాలోని నిగులసరీ ప్రాంతంలో బండరాళ్లు విరిగి.. రెండు కార్లు, ఆ టాటా సుమో, ఓ ట్రక్‌పై పడ్డాయి. అవి పూర్తిగా మట్టిలో మూసుకుపోయాయి. వాటిలో 28 మంది చనిపోయారు. వాతావరణం సరిగా లేకపోవడంతో… NDRF, హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం కూడా కష్టమైపోయింది.

Read Also…  తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి ప్రతాపానికి బ్రిడ్జ్‌లు సైతం కొట్టుకుపోతున్నాయ్.. వాగులు దాటుతున్న క్రమంలో ప్రాణాలు పోతున్నాయ్..

Positive Story: వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు.. పడవనే స్కూల్‌గా మార్చిన టీచర్స్.. ఎక్కడంటే

ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా…?