Viral Video: నడిరోడ్డుపై భార్యాభర్తలను కాల్చేసిన పోలీస్‌ ఆఫీసర్‌.. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరణ ఇచ్చిన అధికారి..

Viral Video: సోషల్‌ మీడియా రోజుల్లో నెట్టింట రోజుకో వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఏది నిజమో ఏది అబద్దమో తేల్చుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న వార్తలను చూసి గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి వీడియోల్లో...

Viral Video: నడిరోడ్డుపై భార్యాభర్తలను కాల్చేసిన పోలీస్‌ ఆఫీసర్‌.. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరణ ఇచ్చిన అధికారి..
Viral Video
Follow us

|

Updated on: Apr 13, 2021 | 5:26 PM

Viral Video: సోషల్‌ మీడియా రోజుల్లో నెట్టింట రోజుకో వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఏది నిజమో ఏది అబద్దమో తేల్చుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న వార్తలను చూసి గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి వీడియోల్లో కొన్ని ఆలోచనను రేకెత్తించేవి అయితే మరికొన్ని మాత్రం భయాందోళనకు గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ భయానక వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో కాస్త తెగ వైరల్‌గా మారడంతో దీనిపై పోలీసు అధికారి స్పందించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిట్ట మధ్యాహ్నం హర్యానాలోని ఓ కేఫ్‌ ముందు ఓ జంటను యూనిఫామ్‌లో ఉన్న పోలీస్‌ అధికారి తన చేతులో ఉన్న గన్‌తో కాల్చేశాడు. దీంతో వారిద్దరూ నేలపై పడిపోయారు. ఇది చూసిన చుట్టు పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో బాగా వైరల్‌ అవుతోంది. 22 సెకండ్ల నిడివి గల ఈ వీడియో చూసిన నెటిజెన్లు భయాందోళనకు గురవుతున్నారు. అంత మంది మధ్యలో అలా ఎలా.. కాల్చేశారని అనుకుంటున్నారు. ఈ వీడియో జెట్‌ వేగంతో నెట్టింట వేగంగా వైరల్‌ అవుతోంది. దీంతో ఈ వీడియో కాస్త చివరికి పోలీసు అధికారుల దృష్టికి చేరుకుంది. దీనిపై పోస్ట్‌మార్టం నిర్వహించిన పోలీసులు ఇది ఒక ఫేక్‌ వీడియో అని తేల్చి చెప్పారు. ఆ వీడియోలో ఉంది నటీనటులు.. ఆ వీడియో ఓ వెబ్‌ సిరీస్‌లో భాగంగా తెరకెక్కించదని పోలీసులు తేల్చారు. ఈ వీడియోను రాహుల్‌ శ్రీ వాస్తవ్‌ అనే పోలీసు అధికారి తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియోతోపాటు.. ‘పోలీసు ఆఫీసర్‌ ఓ జంటను కాల్చినట్లుగా ఉన్న వీడియో గత కొన్ని రోజులుగా నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే మా దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఈ వీడియోను ఓ వెబ్‌ సిరీస్‌ కోసం చిత్రీకరించారు. ఇందులో ఉన్న నటీనటుల పేర్లు శ్వేతా సిన్హా, దేవ్‌’ అంటూ ఈ వీడియో పూర్తిగా ఫేక్‌ అని క్లారిటీ ఇచ్చారు.

పోలీస్‌ ఆఫీసర్‌ చేసిన ట్వీట్..

Also Read: CBSE Board Exam 2021: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలపై కీలక అప్‌డేట్..! పరీక్షలు ఎప్పుడంటే..!

Nivetha Thomas: టాలెంట్ ఉన్నా ఇన్నాళ్లు ఏదో వెలితి.. ‘వకీల్‌సాబ్’ తో నిప్పు కణికలా మెరిసిన నివేద

Covid Horror: శ్మశానంలో చోటు లేదు.. మార్చురీలో అవకాశం లేదు.. కరోనా మృత్యుఘోషలో ఘోర పరిస్థితులు!