AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అస్సాం మహిళపై నెటిజన్లు ప్రశంసలు.. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని ఏంచేసిందో తెలుసా?

దేశంలో మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు ఆగడం లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఇలాంటి వాటిలో మార్పు మాత్రం కనిపించడం లేదు.

అస్సాం మహిళపై నెటిజన్లు ప్రశంసలు.. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని ఏంచేసిందో తెలుసా?
Sexual Assault Case
Venkata Chari
|

Updated on: Aug 02, 2021 | 2:21 PM

Share

దేశంలో మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు ఆగడం లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఇలాంటి వాటిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. కొన్ని రోజుల క్రితం, దేశ రాజధాని ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఈశాన్య ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలను వేధించిన వీడియో వైరల్ అయింది. అదే సమయంలో, అసోంలో బాలికతో లైంగిక వేధింపుల కేసు తెరపైకి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలాగే, ఇక్కడ కూడా అమ్మాయి నిందితుడికి క్లాస్ తీసుకుంది. దీంతో సోషల్ మీడియాలో ప్రజలు అమ్మాయి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

భవ్న కశ్యప్ అనే అమ్మాయి తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో మొత్తం సంఘటన గురించి బహిరంగంగా వివరించింది. పట్టపగలే ఒక వ్యక్తి తనకు చాలా దగ్గరగా వచ్చి, ఏదో ప్రదేశం అడ్రస్ అడగడం ప్రారంభించాడని భవ్నా ​​తెలిపింది. దానికి ఆమె నాకు తెలియదు అని చెప్పింది. కొద్దిసేపటి తరువాత ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ని అసభ్యంగా తాకడంతో.. కోపంతో అతను ప్రయాణిస్తున్న స్కూటీని గట్టిగా లాగింది. దీంతో ఆయన స్కూటీ ఓ కాల్వలో పడిపోయింది. ఆమె నుంచి ఇలాంటి ప్రతిచర్యను ఊహించని ఆయన బైక్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయాడు.

భవ్నా ​​తన పోస్ట్‌లో ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అందించడమే కాకుండా, అసలు ఏమి జరిగిందో ప్రజలు అర్థం చేసుకోవడానికి ఒక వీడియోతోపాటు రెండు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. భవ్నా వివరాల మేరకు గౌహతిలో అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో ఒకటైన జీఎస్ రోడ్డులో సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. నిందితుడి పేరు మధుసనా రాజ్ కుమార్ అని వెల్లడించారు. ఈ విషయం తీవ్రస్థాయికి చేరడంతో అస్సాం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని వెంటనే అరెస్టు చేసి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

భవ్నా ​​పోస్ట్ ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది. దీని గురించి బహిరంగంగా ఒక అమ్మాయికి ఇలా జరగడం చాలా దురదృష్టకరమంటూ ప్రజలు కామెంట్లు పంచుకున్నారు. భవ్నా ​​పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, ‘ఈ సంఘటన గురించి తెలుసుకున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. దేవుడు మీకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలి అంటూ కామెంట్ చేశాడు.

Also Read: Viral Video: వరుడిని అవమానించిన వధువు… దిమ్మ తిరిగిన పెళ్లి కొడుకు ఏం చేశాడో చూస్తే షాకే

Viral Video: కెమెరా ఎఫెక్ట్ ఈ రేంజ్‌లో ఉంటుందా.. పెళ్లి కూతురు రియాక్షన్ చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు..