ఇంటి పైనుంచి కిందపడి మృతి చెందిన కోతి.. అతను ఏం చేశాడంటే..!

సాధారణంగా ఏదైనా జంతువు లేదా పక్షులు మృతి చెందితే వాటి మృత కళేబరాలను చెత్త కుప్పల్లో పడేస్తుంటారు. అదే మనిషి మరణిస్తే కన్నీరు మున్నీరుగా విలపిస్తారు..సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ మనుషులైనా, పశుపక్ష్యాదులైనా ప్రాణం, జీవం ఒక్కటే నని నిరూపించాడు ఓ వృద్ధుడు.

Follow us
Ravi Kiran

|

Updated on: Sep 23, 2023 | 6:28 PM

సాధారణంగా ఏదైనా జంతువు లేదా పక్షులు మృతి చెందితే వాటి మృత కళేబరాలను చెత్త కుప్పల్లో పడేస్తుంటారు. అదే మనిషి మరణిస్తే కన్నీరు మున్నీరుగా విలపిస్తారు..సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ మనుషులైనా, పశుపక్ష్యాదులైనా ప్రాణం, జీవం ఒక్కటే నని నిరూపించాడు ఓ వృద్ధుడు. తన ఇంటి ఆవరణలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఓ కోతికి పద్ధతిగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నాడు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలోని రామకృష్ణపూర్ వి గ్రామంలో గోల మల్లయ్య అనే వ్యక్తి ఇంటి ఆవరణలో కోతులు గుంపులుగా చేరుతుంటాయి. ఆహారం కోసం అటూ ఇటూ ఉరుకులాడుతుంటాయి. ఈ క్రమంలో అతని ఇంటి స్లాబ్‌ పైనుంచి ప్రమాదవశాత్తు ఓ కోతి కింద పడిపోయింది. వెంటనే ప్రాణాలు కోల్పోయింది. అది చూసి మల్లయ్య గుండె కరిగిపోయింది. వానరం అంటే హనుమంతుడి ప్రతిరూపమని, అది తన ఇంటి ఆవరణలో మ్యత్యువాతపడటం అతన్ని కలచివేసింది. చనిపోయిన ఆ కోతిని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. చుట్టుపక్కలవారి సాయంతో దానికి అంత్య క్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే డప్పువాళ్లను పిలిపించి ఎద్దులబండిలో వానరం మృతదేహాన్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులర్పించి అంతిమయాత్ర నిర్వహించాడు. అనంతరం ఆ వానరాన్ని ఖననం చేశాడు.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్