Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Cream Noodles:  వైరల్‌ అవుతున్న వెరైటీ వంటకం.. అదిరిందంటూ లొట్టలేసుకుని లాగించేస్తోన్న కస్టమర్లు..!

Ice Cream Noodles: వైరల్‌ అవుతున్న వెరైటీ వంటకం.. అదిరిందంటూ లొట్టలేసుకుని లాగించేస్తోన్న కస్టమర్లు..!

Anil kumar poka

|

Updated on: Apr 08, 2022 | 8:54 AM

రెగ్యులర్‌ వంటకాలు, ఆహార పదార్థాలు తిని విసుగొచ్చిందేమో ఇటీవల కొందరు వెరైటీ వంటకాలు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త కాంబినేషన్లతో రెసిపీలు ప్రయత్నిస్తున్నారు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ వెరైటీ వంటకాల్లో కొన్ని ఆకట్టుకుంటుంటే..


రెగ్యులర్‌ వంటకాలు, ఆహార పదార్థాలు తిని విసుగొచ్చిందేమో ఇటీవల కొందరు వెరైటీ వంటకాలు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త కాంబినేషన్లతో రెసిపీలు ప్రయత్నిస్తున్నారు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ వెరైటీ వంటకాల్లో కొన్ని ఆకట్టుకుంటుంటే.. మరికొన్ని మాత్రం వికారం తెప్పిస్తున్నాయి. తాజాగా అలాంటి కొత్త వంటకం ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధార‌ణంగా నూడుల్స్, ఐస్‌క్రీం వేర్వేరుగా తింటాం. కానీ ఓ చోట మాత్రం ఏకంగా నూడుల్స్ సూప్‌లోనే ఐస్‌క్రీం వేసుకొని లాగించేస్తున్నారు. ఈ వెరైటీ వంటకానికి సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇదేం వంటకంరా బాబూ.. మీ టేస్ట్‌ తగలయ్యా’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.కాగా ఈ కొత్త వంట‌కానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది జ‌పాన్‌. ఒసాకా సిటీలో ఉన్న ఫ్రాంకెన్ రెస్టారెంట్ లో ఈ వెరైటీ వంటకాన్ని తయారుచేసి కస్టమర్లకు సర్వ్‌ చేస్తున్నారు. కాగా ఇక్కడి ప్రజలు నూడుల్స్ ను ఇష్టంగా తింటున్నారు. తాజాగా ఈ వంటకానికి ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్‌ను జోడించారు. నూడుల్స్‌సూప్‌పైన మెత్తటి ఐస్‌క్రీమ్ టాపింగ్‌తో అలంకరించి సర్వ్‌ చేస్తున్నారు. దీంతో రెస్టారెంట్ కొచ్చిన కస్టమర్లు లొట్టలేసుకుంటూ మరీ ఈ వంట‌కాన్ని తింటున్నారు. కాగా ఈ వంటకం వీడియోను ఓ ఫుడ్‌బ్లాగర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Dog singing Video: వావ్ వాట్ ఏ సింగింగ్ రెయ్.. పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్‌..