Viral Video: యాక్షన్ సినిమా రేంజ్‌లో చేద్దామనుకున్న అమ్మాయిలు.. కట్ చేస్తే సీన్ రివర్స్.. బొక్కబోర్లా పడ్డ ఆమ్మాయిలు(వీడియో)
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం రకరకాల వీడియోలు చూస్తుంటాం. తాజాగా.. ఓ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వాస్తవానికి రోడ్డుపై నడిచేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలు కొనితెచ్చుకున్నవాళ్లమవుతాం.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం రకరకాల వీడియోలు చూస్తుంటాం. తాజాగా.. ఓ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వాస్తవానికి రోడ్డుపై నడిచేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలు కొనితెచ్చుకున్నవాళ్లమవుతాం. ప్రపంచంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 11 శాతం ప్రమాదాలు భారతదేశంలోనే జరుగుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే.. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఘాట్ రోడ్డులో ఓ కారు, మినీ వ్యాన్ ఎదురు పడ్డాయి. అయితే ఆ వ్యాన్‌ను తప్పించుకు వెళ్లాలంటే పక్కన చిన్న ప్లేస్ మాత్రమే ఉంది. ఆ దారిగుండా కారు వెళ్లడం అసంభవం. అయినా అలాగే ముందుకు వెళ్లాలనుకున్నారు కారులో ఉన్నావారు. దాంతో డ్రైవర్ ఆ చిన్న మార్గంలోనే కారుని క్రాస్‌గా డ్రైవింగ్ చేస్తూ వ్యాన్‌ను దాటుకొని ముందుకు వెళ్లాడు. అంతవరకూ బాగానే ఉంది.. అచ్చం యాక్షన్ మూవీలో సీన్‌లాగా.. కానీ అంతలోనే సీన్ రివర్స్ అయిపోయింది. వ్యాన్‌ను దాటుకొని అలా ముందుకు వెళ్లగానే కారు బోల్తా పడిపోయింది. ఆ తర్వాత అందులో నుంచి ఓ అమ్మాయి బయటకు వచ్చింది… ఆ వెనకే ఇంకొక యువతి కూడా బయటకు వచ్చింది. వాస్తవానికి ఓ యువతి కారు నడుపుతోంది. అక్కడ రోడ్డు మీద ఉన్న వ్యక్తులు కూడా వారిని కారులోనుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోను వీక్షిస్తున్ వేలాది మంది నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. “అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..