Viral Video: భూమ్యాకర్షణ లేని చోట వ్యోమగాములు తల స్నానం ఎలా చేస్తారో తెలుసా.? వైరల్‌ వీడియోపై ఓ లుక్కేయండి.

Astronauts Wash Hair: వ్యోమగాముల జీవనశైలికి, సాధారణ ప్రజల జీవన విధానానికి పూర్తి తేడా ఉంటుంది. భూమాకర్షణ లేని ప్రదేశంలో జీవించడం అంత సులభమైన విషయమేమి కాదు. స్పేస్‌ స్టేషన్‌లో...

Viral Video: భూమ్యాకర్షణ లేని చోట వ్యోమగాములు తల స్నానం ఎలా చేస్తారో తెలుసా.? వైరల్‌ వీడియోపై ఓ లుక్కేయండి.
Viral Video Astronuts
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 02, 2021 | 12:03 PM

Astronauts Wash Hair: వ్యోమగాముల జీవనశైలికి, సాధారణ ప్రజల జీవన విధానానికి పూర్తి తేడా ఉంటుంది. గురుత్వాకర్షణ లేని ప్రదేశంలో జీవించడం అంత సులభమైన విషయమేమి కాదు. స్పేస్‌ స్టేషన్‌లో నెలల పాటు నివసించే ఆస్ట్రోనాట్స్‌ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తినే ఆహారం నుంచి వ్యక్తిగత పరిశుభ్రత వరకు ప్రతీ ఒక్క అంశం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా కృత్రిమ వాతావరణంలో, ప్రకృతికి విరుద్ధంగా నివసించే వ్యోమగాములు అప్పుడప్పుడు తాము ఎదుర్కొనే కష్టాలకు సంబంధించిన వీడియోలను ప్రజలతో పంచుకుంటూంటారు. ఇటీవలే పిజ్జాను ఎలా తయారు చేసుకుంటారో తెలిపే ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా స్పేస్‌ స్టేషన్‌లో ఉంటోన్న మరో ఆస్ట్రోనాట్‌ అంతరిక్షంలో తాము జుట్టును ఎలా శుభ్రం చేసుకుంటామన్న విషయాన్ని తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.

మేగాన్ మెక్‌ఆర్థర్ అనే ఆస్ట్రోనాట్‌ ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు.. ‘వ్యోమ గాములు తమ జుట్టును ఎలా శుభ్రం చేసుకుంటారని.?’ ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సమాధానంగా తాను అంతరిక్షంలో తలను శుభ్రం చేసుకుంటున్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘వ్యోమగాములు అందరిలా నీటితో హెడ్‌ బాత్‌ చేయలేరు. దీనివల్ల నీరు ఎటు పడితే అటు వెళ్లి వస్తువులు పాడయ్యే ప్రమాదం ఉంటుంది’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. ఇక ఈ వీడియో గమనిస్తే ఆస్ట్రోనాట్స్‌ జీవన విధానం ఇంత కష్టంగా ఉంటుందా అని అర్థమవుతోంది. ఒక ప్రత్యేకమైన షాంపూను ఉపయోగించి, తక్కువ నీటితో శుభ్రం చేసుకుంటారు. అలాగే నీరు బయటకు పోకుండా టవల్‌ను అడ్డుగా పెట్టుకొని కష్టపడుతోన్న తీరు నెటిజన్లు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Nayanthara: కాబోయే భర్త నయన్‌ను ఏమని పిలుస్తాడో తెలుసా? అదే లేడీ సూపర్‌స్టార్ కొత్త సినిమా టైటిల్

Bheemla Nayak Song: నిమ్మళంగా కనపడే నిప్పుకొండ.. సెభాష్ భీమ్లా నాయకా… టైటిల్ సాంగ్ అదుర్స్..

Twin Elephants: ఆ దేశంలో 80 ఏళ్ల తర్వాత కవల ఏనుగులు జననం… తల్లితో సంతోషంగా ఆడుకుంటున్న గున్న ఏనుగులు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?