Cops – Musician: కళాకారుడి పెర్ఫామెన్స్‌ను అడ్డుకున్న పోలీస్.. ఏంజరిగిందంటే.. వైరల్ వీడియో.
ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో ఓ మ్యుజిషియన్ గిటార్ ప్లే చేస్తున్నాడు. అది గమనించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ అతడిని అడ్డుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోడ్డుపై అతడు సాంగ్ ప్లే చేస్తుండగా వినేందుకు పెద్ద ఎత్తున జనం గుమికూడారు. అయితే ఆ వ్యక్తి గిటార్ పెర్ఫామెన్స్‌ను కానిస్టేబుల్ మధ్యలోనే అడ్డుకున్నాడు. అతని చేతిలోంచి గిటార్ లాక్కొని ‘చెప్పేది నీక్కాదా.. ఆపు’ అంటూ ఆ వ్యక్తిపై కసురుకున్నాడు సదరు కానిస్టేబుల్. దాంతో ఆ వ్యక్తి ఆ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నటుడు రాజేష్ తైలంగ్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఈ ఆర్టిస్టులు ఢిల్లీని మరింత శోభాయమానంగా, శ్రుతిబద్ధం చేస్తున్నారని, ఢిల్లీ పోలీసులు అలా చేయకూడదని క్యాప్షన్ ఇచ్చారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోను 3 లక్షలమందికి పైగా వీక్షించారు. పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. పోలీసుల ప్రవర్తనను పలువురు యూజర్లు తోసిపుచ్చగా మరికొందరు సమర్ధించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..