Teacher illegal Affair: మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల రాసలీలలు.. బయటపెట్టిన విద్యార్థులు.! వీడియో.
స్కూల్లో పనిచేసే మరో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న ప్రేమ వ్యవహారాన్ని విద్యార్థులు బయటపెట్టడం సంచలనంగా మారింది. స్కూల్ ప్రాంగణంలో రాసలీలు కొనసాగిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల రాసలీలలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా సైన్స్, తెలుగు టీచర్ల మధ్యన ప్రేమ వ్యవహారం నడుస్తోందని, వీరి ప్రవర్తన పట్ల విసుగు చెందిన విద్యార్థులు వీధికెక్కారు. పెద్దెముల్ మండలం గోట్లపల్లి శివారులోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో ఇటీవల ప్రిన్సిపల్ గాయత్రి, సిబ్బంది మధ్య వివాదం రాజుకుంది. ప్రిన్సిపల్ గాయత్రి పై కుల వివక్షతోపాటు, విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. తాజాగా అదే స్కూల్లో పనిచేసే మరో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న ప్రేమ వ్యవహారాన్ని విద్యార్థులు బయటపెట్టడం సంచలనంగా మారింది. స్కూల్ ప్రాంగణంలో రాసలీలు కొనసాగిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే మోడల్ స్కూల్లో కొనసాగుతున్న వివాదంపై ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని విద్యార్థులతోపాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..