Anand Mahindra: ఆనంద్ మహీంద్రను కదిలించిన వీడియో.. జీవితాన్ని గెలిచిన దివ్యాంగుడికి ఉద్యోగం కల్పిస్తూ నిర్ణయం..
Anand Mahindra: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రముఖుల్లో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఒకరు. సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు ఆయన...
Anand Mahindra: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రముఖుల్లో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఒకరు. సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు ఆయన. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ మహీంద్ర ట్వి్ట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియోలో.. రెండు చేతులు, కాళ్లు లేని ఓ వ్యక్తి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ట్రాలీ వాహనాన్ని నడుపుతున్నాడు. ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తి తనకు పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పుకొచ్చాడు. పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేవని తెలిపిన సదరు వ్యక్తి డబ్బులు సంపాదించడం కోసమే వాహనాన్ని తయారు చేయించుకొని, సరుకుల రవాణా చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు సదరు వీడియోలో తెలిపాడు. దీనంతటినీ ఓ వ్యక్తి వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారి, చివరికి ఆనంద్ మహీంద్ర కంట పడింది.
ఈ విషయమై వెంటనే స్పందించిన ఆనంద్.. సదరు వీడియోను రీట్వీట్ చేస్తూ.. ఓ పోస్ట్ రాసుకొచ్చారు. ‘ఈ రోజు నా టైమ్‌లైన్‌లో ఈ వీడియో కనిపించింది. తన వైకల్యాన్ని ఎదురించడమే కాకుండా.. ఆత్మగౌరవంతో పని చేసుకుంటున్న ఈ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయా’ అంటూ రాసుకొచ్చారు. ఇక అంతటితో ఆగని మహీంద్ర తమ లాజిస్టిక్స్ సంస్థలోని ఓ ఉద్యోగిని ట్యాగ్ చేస్తూ.. ‘రామ్.. ఇతనికి బిజినెస్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇప్పించగలరా.?’ అంటూ కామెంట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దివ్యాంగుడి పరిస్థితి చూసి చలించి పోయిన ఆనంద్ మహీంద్రకు మద్ధతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
Received this on my timeline today. Don’t know how old it is or where it’s from, but I’m awestruck by this gentleman who’s not just faced his disabilities but is GRATEFUL for what he has. Ram, can @Mahindralog_MLL make him a Business Associate for last mile delivery? pic.twitter.com/w3d63wEtvk
— anand mahindra (@anandmahindra) December 27, 2021
ORR Accident: ఓఆర్ఆర్‌పై లారీని ఢీకొన్న కారు.. ఒకరు దుర్మరణం.. ముగ్గురు పరిస్థితి విషమం
Sweet Porridge: అల్పాహారంలో ఇది చేర్చండి.. ఇక రోజంతా ఫుల్ యాక్టివ్.. ఒంట్లో కొవ్వు కూడా పరార్..!