Viral Video: ఏం ఎంజాయ్ చేస్తున్నార్రా బాబు.. లైఫ్‌ అంటే ఇలా ఉండాలి.. ఈ వీడియో చూస్తే మీరూ ఒప్పుకుంటారు..

Viral Video: జీవితంలో చిన్న చిన్న సంతోషాలను పోగు చేసుకోవాలను చెబుతుంటారు. వృత్తి, బాధ్యతలు ఇలా ఎన్నో కష్టాలతో కూడిన జీవితంలో ఆనందాన్ని వెతుక్కోవడమే జీవితం. ఇక మన సంతోషాలను..

Viral Video: ఏం ఎంజాయ్ చేస్తున్నార్రా బాబు.. లైఫ్‌ అంటే ఇలా ఉండాలి.. ఈ వీడియో చూస్తే మీరూ ఒప్పుకుంటారు..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 28, 2021 | 10:19 AM

Viral Video: జీవితంలో చిన్న చిన్న సంతోషాలను పోగు చేసుకోవాలను చెబుతుంటారు. వృత్తి, బాధ్యతలు ఇలా ఎన్నో కష్టాలతో కూడిన జీవితంలో ఆనందాన్ని వెతుక్కోవడమే జీవితం. ఇక మన సంతోషాలను రెట్టింపు చేసేది మంచి స్నేహితులేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నలుగురు ఫ్రెండ్స్‌ ఒకచోట కలిస్తే చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తుంటరి ఆలోచనలు ఉన్న స్నేహితుల గ్యాంగ్ ఒక చోట చేరితో ఆ హంగామా రెట్టింపు అవుతుంది. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఎస్కలేటర్‌పై కొందరు ఫ్రెండ్స్‌ చేసిన పని ప్రస్తుతం నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. కొందరు మిత్రలు కలిసి ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఎస్కలేటర్‌ ఎక్కారు. ఇలా ఎస్కలేటర్‌ పైకి వెళుతోన్న సమయంలో అందరూ స్టెప్స్‌పై కూర్చొని పడవను నడుపుతున్నట్లు రెండు చేతులను వెనక్కి నెడుతున్నట్లు యాక్టింగ్‌ చేశారు. స్నేహితుల గ్యాంగ్‌ చేసిన హంగామాను అక్కడనున్న వారంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. అక్కడే ఉన్న కొందరు ఆ సరదా సంఘటనను స్మార్ట్‌ ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లు వీరి స్నేహంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవితాన్ని సంతోషంగా గడపమంటే ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వీడియోనూ మీరూ ఓసారి చూసేయండి..

Also Read: CLAT 2022: తొలిసారిగా సంవత్సరానికి రెండు సార్లు కామన్ లా అడ్మిషన్ టెస్ట్.. దరఖాస్తు ఎక్కడ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి..

గాలిలో డాన్స్‌ చేస్తున్న ఇనుప నట్టు !! నెట్టింట వైరల్‌

Viral Video: చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి.. చితికి నిప్పంటిస్తుండగా కళ్లు తెరిచిన వృద్ధుడు!