Viral Video: స్టేజ్‌పై నిద్రపోతున్న వధూవరులు.. మరి బంధువులు ఏంచేశారో తెలుసా..?
సోషల్ మీడియాలో పెళ్లి వీడియోల హవా ఎక్కువైంది. ప్రతిరోజు ఏదో ఒక వీడియో నెట్టింట్లో సందడి చేస్తూనే ఉంటోంది. అలాంటిదే ప్రస్తుతం మరో వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: సోషల్ మీడియాలో పెళ్లి వీడియోల హవా ఎక్కువైంది. ప్రతిరోజు ఏదో ఒక వీడియో నెట్టింట్లో సందడి చేస్తూనే ఉంటోంది. అలాంటిదే ప్రస్తుతం మరో వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా భారతీయ వివాహాలు సాంప్రదాయ రీతిలో జరుగుతున్నా అందులో ఎక్కువ ఆనందం, సరదాల సమ్మేళనం కనిపిస్తాయనడంలో సందేహం లేదు. అయితే పెళ్లి జరిగే రోజు వధూవరులపైనే అందరి చూపు ఉంటుంది. దాంతో వారు కొంత ఒత్తిడి కూడా గురవుతుంటారు. వివాహానికి ముందు జరిగే కొన్ని ఆచారాలు, బంధువుల హాడావుడితో వధూవరులు అలసిపోవడం కూడా మనం చూస్తేనే ఉంటాం. ఎంత అలసిపోయిన పెళ్లి పీటలపై మాత్రం చాలా సరదాగానే కనిపిస్తుంటారు. కానీ, ఈ వీడియోలో మాత్రం వధూవరులు ఇద్దరూ నిద్రపోతూ కనిపించడం విశేషం.
రిషెప్షన్‌లో భాగంగా జరిగిన ఈ తంతు ప్రస్తుతం నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. అసలు విషయంలోకి వస్తే.. పక్కపక్కనే కూర్చున్న వధూవరులతో ఫొటోలు దిగేందుకు అతిథులు వెయిట్ చేస్తున్నారు. కానీ, వీరిద్దరు గాఢ నిద్రలోకి జరుకున్నారు. ఇంతలో కొంతమంది పెళ్లికుమారున్ని నిద్ర నుంచి లేపేందకు ట్రై చేస్తున్నారు. దాంతో ఉలిక్కిపడి పెండ్లి కుమార్తె నిద్ర నుంచి మేల్కింది. కానీ, వరుడు మాత్రం ఎంత లేపినా నిద్ర నుంచి లేవడం లేదు. దాంతో యూజర్ నిరంజన్ మోహపాత్రా వీడియో తీసి నెట్టింట్లో వదిలారు. దీంతో పెళ్లి కుమారుడిపై కామెంట్లు పేలుతున్నాయి. అతిథులు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. అయితే వరుడు నిద్రకు కారణం ఏంటంటూ నెట్టింట్లో కామెంట్లు పేలుతున్నాయి. కొందరు మాత్ర వరుడు తాగి ఉండొచ్చని అంటే.. మరికొందరు పెళ్లి తరువాత నిద్ర ఉందడని ముందే ఇలా నిద్రలోకి జారుకున్నాడని అంటున్నారు. లేవరా బాబు లే అంటూ మరికొంతమంది కామెంట్లు చేయగా, ఫస్ట్‌నైట్‌ని మిస్ చేసుకోకూడదని అలా నిద్ర పోతున్నాడని సరదగా కామెంట్లు చేశారు. మీరూ ఆ వీడియోను చూడండి:
View this post on Instagram
Also Read:
Viral Video: తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడ్డ మహిళ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!
Nara Lokesh: పోకిరి సినిమాలో బ్రహ్మానందంలా చేశాడు..!! జగన్ పై లోకేష్ సెటైర్లు..!! వీడియో
Viral Video: కొండల మధ్యలో కొలను.. 30 అడుగుల ఎత్తు నుంచి యువకుడి డైవింగ్.. భయం తెప్పించే వీడియో!