ISRO: ప్రజ్ఞాన్ మేల్కొనకపోయినా పర్వాలేదు.. రోవర్ పని చేసేసింది: ఇస్రో ఛైర్మన్.
జాబిల్లిపై నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి మేల్కోకపోయినా ఎలాంటి సమస్యా ఉండదని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. తన నుంచి ఆశించిన పనిని రోవర్ ఇప్పటికే పూర్తిచేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము మరిన్ని ప్రయోగాలపై దృష్టిపెట్టామని చెప్పారు. గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయాన్ని ఇస్రో ఛైర్మన్ గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జాబిల్లిపై నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి మేల్కోకపోయినా ఎలాంటి సమస్యా ఉండదని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. తన నుంచి ఆశించిన పనిని రోవర్ ఇప్పటికే పూర్తిచేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము మరిన్ని ప్రయోగాలపై దృష్టిపెట్టామని చెప్పారు. గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయాన్ని ఇస్రో ఛైర్మన్ గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రోవర్ నిద్రాణ స్థితిలోకి వెళ్లాక చంద్రుడిపై రాత్రివేళ ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ దాకా పడిపోయాయని తెలిపారు. అంతటి శీతల వాతావరణం వల్ల దానిలోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ దెబ్బతిని ఉండకపోతే ప్రజ్ఞాన్ మళ్లీ క్రియాశీలమవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇస్రో ఎక్స్‌రే పొలరీమీటర్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోందన్నారు. కృష్ణబిలాలు, నెబ్యులాలు, పల్సర్లపై ప్రయోగాలు జరిపేందుకు.. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా నవంబరు లేదా డిసెంబరులో దాన్ని నింగిలోకి పంపుతామని తెలిపారు. డిసెంబరులో ఇన్‌శాట్-3డీఎస్ వాతావరణ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని చెప్పారు. నవంబరు లేదా డిసెంబరులో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిసార్ ప్రయోగాలు చేపడతామని వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..