AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఓవర్ థింకింగ్‌ని తగ్గించే జపనీస్ టెక్నిక్స్ ఇవే

మీ ఓవర్ థింకింగ్‌ని తగ్గించే జపనీస్ టెక్నిక్స్ ఇవే

Phani CH
|

Updated on: Oct 21, 2025 | 3:12 PM

Share

అతిగా ఆలోచించే వారి కోసం జపనీస్ కొన్ని టెక్నిక్స్ చెబుతారు. చాలా మంది ఓవర్ థింకింగ్ వల్లే మానసికంగా కుంగిపోతున్నారు. ప్రతీ చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి చూస్తారు. దీనివల్ల ఉన్న సమస్యకు పరిష్కారం దొరకకపోగా కొత్తవి వస్తాయి. ఇలాంటప్పుడే ఏం చేయాలో జపనీస్ కొన్ని టెక్నిక్స్ చెప్పారు. మొదటగా సిచ్యుయేషన్ ని ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయడమే ఈ టెక్నిక్.

ఏం జరిగినా సరే అంగీకరించాలి. మన చేతిలో ఏమీ లేదు. ఎందుకిలా జరిగింది అని ఆలోచించి, బాధపడడం వల్ల ఎనర్జీ అంతా వృథా అయిపోతుంది. అదే ఎనర్జీని.. సమస్యను పరిష్కరించుకోవడంపైనే పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో గడిపితే మనసు రిలాక్స్ అవుతుంది. నెగటివ్ థాట్స్ దూరమవుతాయి. మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. హాయిగా నిద్రపట్టేందుకు అవసరమైన హార్మోన్స్ విడుదలవుతాయి. దీన్నే ఫారెస్ట్ బేతింగ్ అంటారు. జపనీస్ చాలా ఎక్కువగా ఈ టెక్నిక్ ఫాలో అవుతారు. మానసికంగా ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే టెన్షన్ తగ్గించి ప్రశాంతంగా మార్చేస్తుంది మెడిటేషన్. అందుకే రోజూ కనీసం ఓ పావుగంట పాటు ధ్యానం చేయాలని యోగా ఎక్స్ పర్ట్స్ సలహా ఇస్తుంటారు. జపనీస్ కూడా ఇదే టెక్నిక్ ఫాలో అవుతారు. దీని పేరు జాజెన్. ఇక మరో టెక్నిక్ సవాళ్లు ఎదుర్కోవడం. ఇక్కడే చాలా మంది తడబడుతుంటారు. అందుకే అతిగా ఆలోచిస్తారు. ఎలాంటి కఠినమైన సవాలు వచ్చినా సరే గట్టిగా నిలబడి ఎదుర్కోవాలి. దీన్నే జపనీస్ గమన్ టెక్నిక్ అంటారు. జీవితం ఉన్నట్టుండి మీకు సడెన్ షాక్ లు ఇస్తూ ఉంటుంది. వెంటనే బెదిరిపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాంటప్పుడే స్ట్రాంగ్ గా ఉండాలి. అదే ఆ తరవాత మీకు అలవాటైపోతుంది. చివరాఖరి టెక్నిక్.. డైవర్ట్ అవడం. ఓ ఇబ్బంది వచ్చినప్పుడు ఎంత సేపూ అదే మూడ్ లో ఉంటే పరిష్కారం దొరకదు. డైవర్ట్ అవ్వాలంటే నచ్చిన పని చేయాలి. ఒక్కోసారి కొత్త పనులు కూడా ట్రై చేయాలి. ఎప్పుడూ ఒంటరిగా సినిమాకి వెళ్లకపోతే ఈసారి అది ట్రై చేయవచ్చు. లేదా కాసేపు అలా బయటకు వెళ్లి వాకింగ్ చేయాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లవ్ సింబల్‌లా తాటి చెట్లుపల్లెలో ప్రకృతి దృశ్యం

పసరికపాము అనుకునేరు.. కాటు వేస్తే కాటికే…

టీచర్లకు బిగ్ రిలీఫ్.. ఎగ్జాం పేపర్లు దిద్దుతున్న.. ఏఐ

దేశంలోనే రిచెస్ట్‌ విలేజ్‌‌.. ఇంటికో లగ్జరీ కారు.. బ్యాంకుల్లో వెయ్యి కోట్లు

తప్పటడుగు.. 100కోట్ల హిట్ సినిమా మిస్సు ! పాపం అఖిల్