AP News: సాధారణ తనిఖీలు.. చెక్‌పోస్టు వద్దకు రాగానే తత్తరపాటు.. బిత్తరచూపులు.. చెక్ చేయగా.!

మూడు టన్నుల పిడిఎస్ బియ్యం, 1600 లీటర్ల రిఫండ్ ఆయిల్, రూ.1.30 లక్షల నగదును పట్టుకున్నారు రావులపాలెం పోలీసులు. ఎన్నికల సందర్భంగా రావులపాలెం మండలం గోపాలపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లో తనిఖీలు సందర్భంగా ఎఫ్.ఎస్.టి టీం వాటిని పట్టుకుంది.

Follow us
Ravi Kiran

|

Updated on: Apr 08, 2024 | 5:12 PM

మూడు టన్నుల పిడిఎస్ బియ్యం, 1600 లీటర్ల రిఫండ్ ఆయిల్, రూ.1.30 లక్షల నగదును పట్టుకున్నారు రావులపాలెం పోలీసులు. ఎన్నికల సందర్భంగా రావులపాలెం మండలం గోపాలపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లో తనిఖీలు సందర్భంగా ఎఫ్.ఎస్.టి టీం వాటిని పట్టుకుంది. పిడిఎస్ బియ్యాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లింగంపాలెం మండలం ఎడవల్లి నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యం సీజ్ చేయడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామన్న రావులపాలెం సీ.ఐ సిహెచ్ ఆంజనేయులు. పట్టుకున్న రూ.1.30 లక్షలకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేవని ఆ నగదును జిల్లా త్రిమేన్ కమిటీకి పంపించామని.. రిఫండ్ ఆయిల్‌కి సంబంధించి స్థానిక తహసిల్దార్‌కు సమాచారం ఇచ్చామన్నారు సి.ఐ