Rain Alert: తెలుగు రాష్ట్రాలో మరో రెండు రోజులు వర్షాలు
తెలుగురాష్ట్రాల్లో మరో రెండ్రోజులు తప్పని వర్షాలు..పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై ద్రోణి, ఆవర్తనం కొనసాగుతోంది..ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి..ఈ సీజన్ లో మార్చి నెల ఆరంభంలోనే మండుతున్న వేసవి నుండి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు మాత్రం ఆందోళన పడుతున్నారు.
తెలుగురాష్ట్రాల్లో మరో రెండ్రోజులు తప్పని వర్షాలు..పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై ద్రోణి, ఆవర్తనం కొనసాగుతోంది..ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి..ఈ సీజన్ లో మార్చి నెల ఆరంభంలోనే మండుతున్న వేసవి నుండి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు మాత్రం ఆందోళన పడుతున్నారు. అయితే రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షం కురిస్తోంది..నిన్న కూడా గాలులు వీస్తూ పిడుగులు కూడా పడ్డాయి..ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో చిరు జల్లులే పడతాయని భావించారు. కానీ మధ్యాహ్నం నుంచి ఉరుములు మొదలయ్యాయి. అనేక చోట్ల భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు ప్రజలను భయపెట్టాయి..అయితే రానున్న రెండురోజులూ ఓ మోస్తరు నుంచి భారీ వాన పడే అవకాశం ఉందని..పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆదివారమైనా బ్యాంకులన్నీ పనిచేయాల్సిందే.. ఆర్బీఐ కీలక ఆదేశాలు
ప్రమాదపు అంచున ప్రపంచం.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
ఈ ఒక్కటి మీ ఆహారంలో చేర్చుకోండి.. నిద్రలేమినుంచి గుండె జబ్బుల వరకు పరార్