ఆదివారమైనా బ్యాంకులన్నీ పనిచేయాల్సిందే.. ఆర్బీఐ కీలక ఆదేశాలు
మార్చి 31వ తేదీ ఆదివారమే అయినప్పటికీ అన్ని ఏజెన్సీ బ్యాంకులు పనిచేయాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం 2023-24కి మార్చి 31 చివరి రోజు కావడంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచ్‌లు తెరిచే ఉండాలని సూచించింది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపులతో ముడిపడిన బ్యాంకుల బ్రాంచులు అన్నింటిని మార్చి 31 ఆదివారం రోజు తెరిచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
మార్చి 31వ తేదీ ఆదివారమే అయినప్పటికీ అన్ని ఏజెన్సీ బ్యాంకులు పనిచేయాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం 2023-24కి మార్చి 31 చివరి రోజు కావడంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచ్‌లు తెరిచే ఉండాలని సూచించింది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపులతో ముడిపడిన బ్యాంకుల బ్రాంచులు అన్నింటిని మార్చి 31 ఆదివారం రోజు తెరిచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అవసరమైన బ్రాంచులను తెరిచి ఉంచుతున్నామని, సేవలు లభిస్తాయంటూ ప్రచారం కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలిచ్చింది. కాగా బ్యాంకులు సాధారణంగా అన్ని ఆదివారాలు, ప్రతి నెలా 2, 4వ శనివారాల్లో మూసి ఉంటాయి. ఇక ఏజెన్సీ బ్యాంకులు అంటే అన్ని బ్యాంకుల మాదిరిగా ఇవి కూడా కమర్షియల్ బ్యాంకులే. అయితే ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి ఏజెన్సీ బ్యాంకులకు మాత్రమే ఆర్బీఐ అధికారం ఇస్తుంది. ఈ బ్యాంకులు ప్రభుత్వం తరపున వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు, ప్రభుత్వ సేవలను సులభతరం చేయడంలో ఏజెన్సీ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పన్నుల సేకరణ, ప్రభుత్వ చెల్లింపులు, పంపిణీతో పాటు ముఖ్యమైన పలు సేవలను అందిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రమాదపు అంచున ప్రపంచం.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
ఈ ఒక్కటి మీ ఆహారంలో చేర్చుకోండి.. నిద్రలేమినుంచి గుండె జబ్బుల వరకు పరార్
పెద్ద శబ్దంతో పేలిన ఈ – బైక్ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు