పెద్ద శబ్దంతో పేలిన ఈ – బైక్‌ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీ పేలి, ఇద్దరు మహిళలతో పాటు ఒక వృద్ధునికి గాయలయ్యాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు,, పక్కనే ఉన్న గోడ కూలిపోయాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అధిపతి యాసిన్ తాడ్వి తెలిపారు. శాంతి నగర్‌లోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగిందన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో బ్యాటరీ పేలిందని అధికారి తెలిపారు.

పెద్ద శబ్దంతో పేలిన ఈ - బైక్‌ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు

|

Updated on: Mar 21, 2024 | 8:28 PM

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీ పేలి, ఇద్దరు మహిళలతో పాటు ఒక వృద్ధునికి గాయలయ్యాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు,, పక్కనే ఉన్న గోడ కూలిపోయాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అధిపతి యాసిన్ తాడ్వి తెలిపారు. శాంతి నగర్‌లోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగిందన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో బ్యాటరీ పేలిందని అధికారి తెలిపారు. ఛార్జింగ్ కోసం ఇంట్లోనే బైక్‌ పెట్టుకున్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సిందన్నారు. ఘటనలో 28 ఏళ్ల మహిళ, పొరుగింట్లో ఉంటున్న 66 ఏళ్ల వృద్ధుడు, మరో 56 ఏళ్ల మహిళ గాయపడ్డారు. ఇంట్లో ఒక్కసారి మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురు బాధితులను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారి తెలిపారు. బ్యాటరీ పేలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆహారం కోసం వచ్చి కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి..

చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్..అరుణాచల్ ప్రదేశ్‌ భారత్ దే

కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌

సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్న మనిషి మెదడులో అమర్చిన చిప్‌

Follow us