AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఘన నివాళులు.. తెలంగాణ అసెంబ్లీ ప్రతేక సమావేశాలు

మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు సీఎం రేవంత్. ఆయన చేసిన సేవలు గుర్తుండేలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Dec 30, 2024 | 12:17 PM

Share

తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అయింది.. ఈనెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సభ నివాళులు అర్పించింది.. సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం అయింది.. ఈ సందర్భంగా సభ్యులు మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలను గుర్తుచేసుకున్నారు. దీంతో పాటు తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని పోషించిన కీలక పాత్రను అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ గుర్తుచేసుకునే అవకాశం ఉంది.

మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు సీఎం రేవంత్. ఆయన చేసిన సేవలు గుర్తుండేలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. సభ్యుల సూచన మేరకు అవసరమైతే మరో చోటకు మారుస్తామన్నారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని కోరారు.

అందరికి ఆహార భద్రత చట్టం తీసుకువచ్చిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్‌కే దక్కుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉపాధి హామీ పథకం దేశంలో ఎంతో మార్పు తీసుకువచ్చిందన్న భట్టి.. కరోనా సమయంలో ఉపాధి హామీ గ్రామీణులను ఆదుకుందని అన్నారు. భూమి లేని వారికి అటవీ హక్కుల చట్టం భరోసానిచ్చిందన్నారు భట్టి విక్రమార్క

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..