Yadadri: యాదగిరిగుట్ట భక్తులకు గుడ్‌న్యూస్.. రెండేళ్లకు కలిగిన మోక్షం!
యాదగిరిగుట్టపైకి ఫిబ్రవరి 11 నుంచి ఆటోలు నడువనున్నాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు పచ్చజెండా ఊపి ఆటోల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట ప్రధానాలయం రీ ఓపెన్ సందర్భంగా గత ప్రభుత్వం.. 2022 మార్చి 28న కొండపైకి ఆటోలను నిషేధించింది. దీంతో ఆటో డ్రైవర్లు రిలే నిరాహార దీక్షలకు దిగారు.
యాదగిరిగుట్టపైకి ఫిబ్రవరి 11 నుంచి ఆటోలు నడువనున్నాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు పచ్చజెండా ఊపి ఆటోల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట ప్రధానాలయం రీ ఓపెన్ సందర్భంగా గత ప్రభుత్వం.. 2022 మార్చి 28న కొండపైకి ఆటోలను నిషేధించింది. దీంతో ఆటో డ్రైవర్లు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఘాట్ రోడ్డు సమీపంలో యాదరుషి విగ్రహం వద్ద దాదాపుగా 20 నెలల పాటు దీక్షలు కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పోలీసుల సూచన మేరకు 2023 నవంబర్‌లో దీక్షలు విరమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆటో డ్రైవర్లు, ఆలయ ఉద్యోగులు, పోలీసులతో పలు దఫాలుగా రివ్యూలు చేశారు. సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. ఈ నెల 11 నుంచి కొండపైకి ఆటోలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటో డ్రైవర్ల రెండు సంవత్సరాల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది. యాదాద్రి టెంపుల్ అభివృద్ధి పేరుతో వెయ్యికి పైగా కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు ప్రభుత్వ విప్ అయిలయ్య. నాలుగేళ్లుగా ఆటోలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఉపాధి కోల్పోయారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం యాదాద్రి కొండపైకి ఆటోలకు అనుమతించామని, త్వరలోనే షాపులు కోల్పోయిన వాళ్లకూ న్యాయం చేస్తామని అయిలయ్య హామీ ఇచ్చారు.
బైట్ః అయిలయ్య, ఎమ్మెల్యే ఆలేరు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

