Andhra Pradesh: భళారే విచిత్రం..! స్మశానంలో ఓట్లు అడుగుతున్నారు.. ఎందుకో తెలుసా?

Andhra Pradesh: భళారే విచిత్రం..! స్మశానంలో ఓట్లు అడుగుతున్నారు.. ఎందుకో తెలుసా?

Anil kumar poka

|

Updated on: Feb 12, 2024 | 11:01 AM

ఏపీలో మరో ఒకటి, రెండు నెలల్లో ఎన్నిక‌లు జరగనున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే తొలి ద‌ఫా ఓట‌ర్ల జాబితా కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకవైపు దొంగ ఓట్లపై ఈసీ కొరడా ఝుళిపిస్తుంటే విపక్షాల నిరసన వినూత్న రీతిలో కొనసాగుతోంది. చంద్రగిరిలో దొంగ ఓట్లపై తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల సుధా యాదవ్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు.

ఏపీలో మరో ఒకటి, రెండు నెలల్లో ఎన్నిక‌లు జరగనున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే తొలి ద‌ఫా ఓట‌ర్ల జాబితా కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకవైపు దొంగ ఓట్లపై ఈసీ కొరడా ఝుళిపిస్తుంటే విపక్షాల నిరసన వినూత్న రీతిలో కొనసాగుతోంది. చంద్రగిరిలో దొంగ ఓట్లపై తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల సుధా యాదవ్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు జరిగినట్లు ఇప్పటికే ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు కూడా అందాయి. అయితే ఈ మధ్యనే విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలోనూ చనిపోయిన వారికి ఓట్లు ఉన్నట్లు గుర్తించిన నేతలు అధికార యంత్రాంగం తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి ఓట్లను ఇంకా తొలగించకపోవడంతో చంద్రగిరి స్మశానం వాటిక వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు సుధా యాదవ్. చనిపోయిన వారి సమాధుల వద్ద ప్రచారంలో భాగంగా వాల్ క్లాక్, కుక్కర్లు ఇచ్చి తనుకు ఓటే వేయాలని కోరారు. చంద్రగిరి నుంచి టీడీపీ టికెట్‌ను ఆశిస్తున్న బిసి నేత బడి సుధా యాదవ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని, బోగస్ ఓట్లను తొలగించాలని ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓటర్ల జాబితాలోని అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..