AP Rains: ఏపీలో పలు చోట్ల కుండపోత వర్షాలు.. నీట మునిగిన ఊళ్లు.!
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, రాజానగరం, రావులపాలె, రంపచోడవరం, గోకవరం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డు నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటచేలు చెరువులను తలపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, రాజానగరం, రావులపాలె, రంపచోడవరం, గోకవరం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డు నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటచేలు చెరువులను తలపిస్తున్నాయి. ఇటు కాకినాడ జిల్లా జగ్గం పేట, తుని, సామర్లకోట, పెద్దాపురంలో బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇటు ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లిలో ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోనూ భారీ వర్షం కురుస్తోంది. అరకు, పాడేరులో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అలాగే విజయవాడలోనూ ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలయమం అయ్యాయి. కానూరు, తులసినగర్‌లో తేలికపాటి వర్షాలకే ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నివాసాల్లోకి మురుగు నీరు వచ్చిన చేరుతుందని స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,01,767 క్యూసెక్కులు కాగా.. వివిధ ప్రాజెక్టుల్లో దిగువకు వరద నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంకగ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం చేయవద్దని హెచ్చరించారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతలకు తరలించాలని సూచించారు. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ఆదేశించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.