మేడ్చల్ జిల్లా కండ్లకోయ CMR ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో తమకు భద్రత కరువైందంటూ ఆరోపిస్తున్నారు. బాత్రూమ్లో వీడియోలు తీశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో క్యాంపస్ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.