కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్గేట్ దగ్గర గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ఇద్దరు కానిస్టేబుళ్లపైకి కారును ఎక్కించింది గంజాయి ముఠా. విశాఖ నుంచి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేస్తుండగా గంజాయి బ్యాచ్ ఈ ఎటాక్ చేసింది. కానిస్టేబుల్ లోవరాజుకి తీవ్రగాయాలు కాగా...మరో కానిస్టేబుల్కి స్వల్ప గాయమైంది.