Gold Coins: తవ్వకాల్లో బయటపడిన మట్టి కుండ.! లోపల కళ్లు చెదిరే సీన్..
పాత ఇళ్లు కూల్చివేస్తుండగా.. ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా.. కాలువలు, చెరువల కోసం పూడిక పనులు చేస్తుండగా.. పురాతన నిధి, నిక్షేపాలు, విగ్రహాలు దొరికిన ఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఎవరైన ఒక వ్యక్తి ఇలా నిధి దొరికితే మాత్రం వారు చప్పుడు కాకుండా తీసుకెళ్లి నిధిని దాచుకుంటారు. అలా నిధి బయటపడ్డ సమయంలో జనం ఉంటే మాత్రం… ఆ వార్త గుప్పుమని అధికారుల వద్దకు వెళ్తుంది.
పాత ఇళ్లు కూల్చివేస్తుండగా.. ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా… కాలువలు, చెరువల కోసం పూడిక పనులు చేస్తుండగా.. పురాతన నిధి, నిక్షేపాలు, విగ్రహాలు దొరికిన ఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఎవరైన ఒక వ్యక్తి ఇలా నిధి దొరికితే మాత్రం వారు చప్పుడు కాకుండా తీసుకెళ్లి నిధిని దాచుకుంటారు. అలా నిధి బయటపడ్డ సమయంలో జనం ఉంటే మాత్రం… ఆ వార్త గుప్పుమని అధికారుల వద్దకు వెళ్తుంది. వెంటనే వారు రంగప్రవేశం చేసి ఆ నిధిని స్వాధీనం చేసుకుంటారు. అయితే కొన్ని సార్లు పురావస్తు శాస్త్రవేత్తలు చారిత్రక ఆధారాల కోసం తవ్వకాలు జరుపుతుండగా కూడా నిధులు దొరికిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా టర్కీలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. పురాతన గ్రీకు నాణేలతో నిండిన కుండను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
టర్కీలో పురాతన గ్రీకు నాణేలతో నిండిన కుండను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పశ్చిమ టర్కీలోని పురాతన గ్రీకు నగరమైన నోషన్‌లోని ఒక ఇంటి కింద బంగారు నాణేలతో నిండిన ఓ మట్టి కుండను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దొరికిన బంగారు నాణేలు పర్షియన్ సామ్రాజ్యం ఉపయోగించే గోల్డ్ కాయిన్ పర్షియన్ డారిక్ మాదిరిగా… మోకాలి విలుకాడు చిత్రాన్ని కలిగి ఉన్నాయి. గ్రీకు చరిత్రకారుడు జెనోఫోన్ ప్రకారం, ఒక సైనికుడి నెలవారీ జీతం ఒక్క డారిక్ విలువైనదిగా తెలిసింది. నోషన్‌కు ఈశాన్యంగా 60 మైళ్ల దూరంలో ఉన్న సార్డిస్‌లో ఈ నాణేలు ముద్రించబడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నాణేలు.. కిరాయి సైనికులు చెల్లింపుగా ఉపయోగించారని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే దానిని భూమి లోపల దాచడానికి గల కారణం మాత్రం అంతుబట్టడం లేదు. తవ్వకాల్లో ఇంత విలువైన నిధిని కనుగొనడం చాలా అరుదు అని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో పురావస్తు శాస్త్ర ప్రొఫెసర్, నోషన్ ఆర్కియాలజికల్ సర్వే డైరెక్టర్ క్రిస్టోఫర్ రాట్టే అన్నారు. నాణేలు క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దానికి చెందినవనిగా నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.