G20 Summit: చుట్టూ డేగ కళ్లే.. చీమ చిటుక్కుమన్నా వెంటనే పసిగట్టేస్తారు.. స్పెషల్ సెక్యూరిటీ వలయంలో ఢిల్లీ

|

Sep 08, 2023 | 8:22 AM

ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. జీ20 సమావేశాల నేపథ్యంలో ఢిల్లీకి వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆర్మీ జల్లెడ పట్టే పనిలో బిజీగా ఉన్నారు. జీ20 సదస్సు జరిగే సమయంలో రాజధాని ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా ఆర్మీ పలు మాక్ డ్రిల్స్ నిర్వహించింది.

G20 Summit: చుట్టూ డేగ కళ్లే.. చీమ చిటుక్కుమన్నా వెంటనే పసిగట్టేస్తారు.. స్పెషల్ సెక్యూరిటీ వలయంలో ఢిల్లీ
G20 Summit Security
Follow us on

ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. జీ20 సమావేశాల నేపథ్యంలో ఢిల్లీకి వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆర్మీ జల్లెడ పట్టే పనిలో బిజీగా ఉన్నారు. జీ20 సదస్సు జరిగే సమయంలో రాజధాని ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా ఆర్మీ పలు మాక్ డ్రిల్స్ నిర్వహించింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, సహా పలువురు దేశాధినేతలు బస ఉండే ప్రాంతాల్లో మూడంచెల భ‌ద్రత ఏర్పాటు చేశారు. 30మంది దేశాధినేతలు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటుండడంతో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దేశ రాజధానిలో భారత సైన్యం విధ్వంస వ్యతిరేక మాక్ డ్రిల్స్ నిర్వహించింది. వీరి భద్రతలో ఎలాంటి లోపాలు తలెత్తినా చాలా ఇబ్బందులు ఎదురుకానున్నాయి. దీంతో కేంద్రం ఆర్మీతో పాటు ఢిల్లీ, ఇతర రాష్ట్రాల పోలీసుల్ని సైతం భారీ ఎత్తున దేశ రాజధానిలో మోహరించింది. అలాగే విదేశీ అతిధుల భద్రత కోసం ప్రత్యేక బలగాల్ని సైతం రప్పిస్తున్నారు.

జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భారీ ఎత్తున వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. ఇప్పటికే రోడ్డు, రైలు రవాణాను దాదాపుగా నియంత్రించిన కేంద్రం.. ఇప్పుడు నగరంలోకి వచ్చే వాహనాల్ని పూర్తి స్ధాయిలో తనిఖీ చేయిస్తోంది. ఢిల్లీకి వచ్చే వాహనాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.  ఇప్పటికే ఢిల్లీలో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. స్కూళ్లకు మూడురోజులు సెలవులు ప్రకటించారు.  ఆన్‌లైన్‌ ఆర్డర్లు, ఆన్‌లైన్‌ డెలివరీలు మూసివేశారు. అత్యవసర సర్వీసులు తప్ప దాదాపు అన్ని సేవలు మూతబడ్డాయి. 160 డొమెస్టిక్‌ ఫ్లైట్లు క్యాన్సిల్‌ అయ్యాయి. విదేశీ అతిథుల కోసం రైట్‌హ్యాండ్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేశారు.

కాగా, శిఖరాగ్ర సదస్సు జరిగే ఐటీఓ ప్రాంతంలో ఏడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. చీమ చిటుక్కుమన్నా.. వెంటనే పసిగట్టేలా పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఏఐ కెమెరాలు కూడా నిఘాలో ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..