Fire Incident: ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అపశ్రుతి.. హారతి ఇచ్చేవేళ మంటలు.!

Fire Incident: ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అపశ్రుతి.. హారతి ఇచ్చేవేళ మంటలు.!

Anil kumar poka

|

Updated on: Mar 25, 2024 | 3:00 PM

పవిత్ర హోళీ పండుగవేళ పరమేశ్వరుని ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మహాకాళేశ్వరునికి హారతి ఇచ్చే వేళ ఆలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆలయంలో పెద్దసంఖ్యలో భక్తులు ఉన్నారు. వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు.

పవిత్ర హోళీ పండుగవేళ పరమేశ్వరుని ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మహాకాళేశ్వరునికి హారతి ఇచ్చే వేళ ఆలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆలయంలో పెద్దసంఖ్యలో భక్తులు ఉన్నారు. వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయంలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని మహాకాళేశ్వరుని గర్భగుడిలో సోమవారం ఉదయం భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పూజారితో సహా 13 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వేలాది మంది భక్తులు ఆలయంలో ఉన్నారు. వారంతా ఆలయంలో జరిగే హోలీ వేడుకలను వీక్షించేందుకు వచ్చారు. హారతి సమర్పిస్తున్న పూజారి సంజీవ్‌ వెనుక నుంచి ఎవరో గులాల్ వెదజల్లడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడున్న కొందరు భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గర్భగుడిలో హారతి సమర్పిస్తున్న సంజీవ్ పూజారి, వికాస్, మనోజ్, సేవాధారి ఆనంద్ కమల్ జోషితో సహా 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించినట్లు ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు. ఘటనపై విచారణకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. భస్మ హారతి జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయని ఆలయ పూజారి ఆశిష్ గురు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..