Nikhil Siddhartha: టీడీపీలో చేరిన స్టార్ హీరో.! ఈ సమయంలో ఎందుకు ఇలా.?

Nikhil Siddhartha: టీడీపీలో చేరిన స్టార్ హీరో.! ఈ సమయంలో ఎందుకు ఇలా.?

Anil kumar poka

|

Updated on: Mar 31, 2024 | 11:18 AM

రీజనల్ సినిమాలతో పాటు.. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరో నిఖిల్.. వీలు దొరికనప్పుడల్లా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. చాలా అంశాలతో పాటు.. సామాజిక అంశాలపై కూడా తన స్టాండ్ ఏంటో చెబుతుంటారు. అలా చెబుతూనే మనోడిలో పొలిటికల్ స్పార్క్‌ ఉందనే కామెంట్ వచ్చేలా చేసుకున్నాడు. అయితే ఉన్నపళంగా ఇప్పుడా కామెంట్‌నే నిజం చేశాడు.

రీజనల్ సినిమాలతో పాటు.. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరో నిఖిల్.. వీలు దొరికనప్పుడల్లా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. చాలా అంశాలతో పాటు.. సామాజిక అంశాలపై కూడా తన స్టాండ్ ఏంటో చెబుతుంటారు. అలా చెబుతూనే మనోడిలో పొలిటికల్ స్పార్క్‌ ఉందనే కామెంట్ వచ్చేలా చేసుకున్నాడు. అయితే ఉన్నపళంగా ఇప్పుడా కామెంట్‌నే నిజం చేశాడు. తాజాగా తెలుగు దేశం పార్టీలో చేరిపోయాడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిఖిల్ .. ఈ స్టార్ హీరోకు టీడీపీ కండువా కప్పీ మరీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక నిఖిల్ రాజకీయాల్లోకి రానున్నాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై స్పందించలేదీ యంగ్ హీరో. అభిమానులు కూడా అవన్నీ పుకార్లే అని అనుకున్నారు. అయితే సడెన్ గా టీడపీలో చేరి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు నిఖిల్. ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ టీడీపీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. అతను కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడా? లేదా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే టీడీపీ ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాబట్టి నిఖిల్ టీడీపీ తరఫున ఏపీలో ప్రచారం చేస్తాడని తెలుస్తోంది. మరి టీడీపీ అధిష్టానం ఈ టాలీవుడ్ హీరోకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..