TOP 9 ET: “RC16” అదిరిపోతుంది అంతే..! | ‘ కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు..!
గతంలో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ కారణంగా.. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్‌కు ఎయిమ్ అయ్యారు సమంత. అప్పట్లో 'మహేష్ వన్ నేనొక్కడినే' సినిమాలో.. హీరోయిన్ మహేష్ కాళ్ల దగ్గర ఉన్న పోస్టర్‌ను ట్యాగ్ ను చేసిన సామ్.. మేకర్స్ తీరును తప్పుబడుతూ.. ట్వీట్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఖుషీ సినిమా సెంకడ్ సింగిల్లో .. ఓ సీన్లో హీరో విజయ్ కాళ్ల దగ్గరే కూర్చున్నారు.
01. Ram Charan, Buchi babu
ఓ పక్క శంకర్ డైరెక్షన్లో చెర్రీ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ ఇంకా కంప్లీట్ కానే లేదు. అప్పుడే ఆర్సీ 16 అప్డేట్ కావాలంటూ.. ఫ్యాన్స్.. డైరెక్టర్ బుచ్చిబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఒత్తిడి తేవడమే కాదు.. రీసెంట్ గా బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లిన ఆయన్ను.. ఆర్సీ 16 అప్డేట్ అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేశారు. దీంతో డైరెక్టర్ బుచ్చిబాబు.. సినిమా అదిరిపోతుంది అంటూ.. ఒక్క ముక్కలో.. ఆర్సీ 16 ఎలా ఉంటుందనే దానిపై హింట్ ఇచ్చారు. ఈ ఒక్క ముక్కతోనే అటు ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే.. నెట్టింట ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నారు.
02.Samantha
గతంలో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ కారణంగా.. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్‌కు ఎయిమ్ అయ్యారు సమంత. అప్పట్లో ‘మహేష్ వన్ నేనొక్కడినే’ సినిమాలో.. హీరోయిన్ మహేష్ కాళ్ల దగ్గర ఉన్న పోస్టర్‌ను ట్యాగ్ ను చేసిన సామ్.. మేకర్స్ తీరును తప్పుబడుతూ.. ట్వీట్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఖుషీ సినిమా సెంకడ్ సింగిల్లో .. ఓ సీన్లో హీరో విజయ్ కాళ్ల దగ్గరే కూర్చున్నారు. ఇక దీన్ని నోటీస్ చేసిన మహేష్ ఫ్యాన్స్… సామ్ చేసిన అప్పటి ట్వీట్‌ను.. బయటికి తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఇన్‌స్టెంట్ కర్మ అంటూ.. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.
03.Project k
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ప్రాజెక్ట్ కె. కామిక్ కాన్‌కి వెళ్తున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్ కెక్కిన ఈ మూవీ.. ఆ ఈవెంట్‌కు వెళ్లేందుకు కౌంట్ డౌన్ షురూ అయిందంటూ..తాజాగా తమ సోషల్ మీడియా హ్యాండిల్లో అనౌన్స్ చేశారు. జూలై 20న జరగబోయే ఈ వేడుక ప్రాజెక్ట్ కె క్రేజ్‌తో నిండడం ఖాయంటూ.. హింట్ ఇచ్చారు.
04. Bro
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న సినిమా బ్రో. సముద్రకని తెరకెక్కిస్తున్నారు. తమిళ సినిమా వినోదయ సిత్తం మూవీకి రీమేక్ ఇది. ఈ చిత్రంలోని మై డియర్ మార్కండేయ పాటను ఆల్రెడీ విడుదల చేశారు. ఇప్పుడు సెకండ్ సాంగ్ జానవులే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 15న పాటను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
05.Rashmika
నితిన్ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నారనే వార్త జోరుగా వైరల్ అవుతోంది. ఆమె ప్రస్తుతం పుష్ప2, రెయిన్‌బో చిత్రాల్లో నటిస్తున్నారు. నార్త్ లో యానిమల్‌లో యాక్ట్ చేస్తున్నారు. కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో… నవ్వుతూ రెండు చేతులు నోటికి అడ్డంపెట్టుకున్న పొటోతో పాటు, ‘ఇప్పుడు జరుగుతున్న చాలా విషయాల పట్ల నా రియాక్షన్ ఇది’ అంటూ రష్మిక పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
06. Nani
నాని హీరోగా నటిస్తున్న30వ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. హాయ్ నాన్న అంటూ టైటిల్‌ని రివీల్ చేశారు మేకర్స్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాని కుమార్తెగా బేబీ కియారా ఖన్నా కనిపిస్తారు. ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
07.Double ismart
రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది డబుల్ ఇస్మార్ట్. రెగ్యులర్ షూటింగ్ ముంబైలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలైంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డిజైన్ చేశారు. టెక్నికల్‌గా హై స్టాండర్స్డ్ తో రూపొందిస్తున్నారు. ఇప్పుడు షూట్ చేసే యాక్షన్ సీక్వెన్స్ ని కేచ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మహాశివరాత్రికి విడుదలవుతుంది ఈ సినిమా.
08.Jawan
జవాన్ సినిమాకు సంబంధించి రోజుకో ఇంట్రస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన సినిమా జవాన్. దీపిక పదుకోన్, విజయసేతుపతి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాలో కియారా అద్వానీ గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే షారుఖ్, కియారాకు సంబంధించిన పోర్షన్ తెరకెక్కించినట్టు సమాచారం.
09. 5 what jhumma
రణ్‌వీర్‌సింగ్, ఆలియా జంటగా నటిస్తున్న రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీ నుంచి వాట్ ఝుమ్కా వాటే ఝుమ్కా అంటూ సాంగ్ రిలీజ్ అయింది. పెప్పీ బీట్స్ తో, డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకుంటోంది ఈ సాంగ్. 1966లొ ఆశా భోంస్లే ఆలపించిన ఝుంకా గిరా రే పాటకి గౌరవ సూచకంగా ఈ పాటను తెరకెక్కించినట్టు మేకర్స్ చెప్పారు. జులై 28న విడుదల కానుంది రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...