TOP 9 ET: 7ఏళ్ల ప్రేమ.. ఒకటైన వీరి కథ.. | 6గంట్లోనే.. దిమ్మతిరిగే రికార్డ్ వ్యూస్.. దటీజ్ NBK రేంజ్..!
నేలకొండ భగవంత్ కేసరి.. బరిలో దిగాడు! జూలు విదిల్చే సింహంలా.. ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. గర్జించే బెబ్బులిలా.. తన మార్క్ డైలాగులతో రెచ్చిపోయాడు. మచ్చల చిరుతలా.. మాటు వేసి మరీ.. మృగాల్లను వేటాడడం షురూ చేశారు. మంద బలం చూసుకుని ముందు కొచ్చే రాజును కాను..
01.Mahesh babu
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నారు. ఈ ఫోటోస్ చూసిన అభిమానులు రోజు రోజుకు మహేష్ వయసు తగ్గిపోతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు సూపర్ స్టార్. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
02.Chiranjeevi
ఇటీవల బాలాసోర్‌లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ బాధితుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన పిలుపుకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రమాదంలో గాయపడిన వారి కోసం రక్తదానం చేయాలంటూ చిరు పోస్ట్ చేయగానే అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు వచ్చారు. తన మాట కోసం రక్తదానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిరు.
03.Shaithan
సైతాన్ వెబ్ సిరీస్ విషయంలో వస్తున్న విమర్శలపై దర్శకుడు మహి వి రాఘవ స్పందించారు. ఈ సారి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్ కథ చెప్పాలనకున్నా అన్న మహి.. తాను ఎంచుకున్న కథ ఇలా చెప్పటమే కరెక్ట్ అన్నారు. ఆడియన్స్‌ను షో చూసేలా చేయటం కోసం బూతులు వాడలేదని, కథ డిమాండ్ మేరకే సినిమాలో డైలాగ్స్
04.Animal
అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ యానిమల్. రణబీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని చిత్రయూనిట్ ఖండించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, ముందు చెప్పినట్టుగా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
05.Bloody Daddy
షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బ్లడీ డాడీ. ఈ సినిమాను డిజిటల్‌లో ఫ్రీగా స్ట్రీమ్ చేయటంపై దర్శక నిర్మాత వివేక్ రంజన్ అగ్రిహోత్రి సెటైర్స్ వేశారు. ‘200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాను ఫ్రీగా స్ట్రీమ్ చేయటం ఏంటి? ఇదెక్కడి బిజినెస్ మోడల్? బాలీవుడ్ తన వినాశనాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
06.Pathaan
పఠాన్ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. రష్యాలో భారీగా రిలీజ్ అవుతున్న తొలి ఇండియా మూవీగా చరిత్ర సృష్టించబోతోంది. ఈ నెల 13న రష్యాతో పాటు కామన్ వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్‌లో 3 వేల థియేటర్లలో పఠాన్ రిలీజ్ కానుంది. షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ మూవీ పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
07.Varunlav
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. మణికొండలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ కజిన్స్ అంతా ఈ వేడుకలో సందడి చేశారు.
08. 7 yEars
ఇక తన లవర్ బాయ్ వరుణ్ తో ఎంగేజ్ మెంట్ అయిపోవడంతో.. తన లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైందనేది చెప్పారు లావణ్య. 2016 లోనే చిరకాల ప్రేమ దొరికిందని.. ఎంగేజ్ మెంట్ ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేస్తూ రాసుకొచ్చారు. అయితే 2016లోనే వీరి మిస్టర్ సినిమా షూటింగ్ మొదలైంది. శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన ఈసినిమా సెట్‌లోనే వీరి ప్రేమ పెరిగి పెద్దైంది.
09. Bagavanth kesari
నేలకొండ భగవంత్ కేసరి.. బరిలో దిగాడు! జూలు విదిల్చే సింహంలా.. ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. గర్జించే బెబ్బులిలా.. తన మార్క్ డైలాగులతో రెచ్చిపోయాడు. మచ్చల చిరుతలా.. మాటు వేసి మరీ.. మృగాల్లను వేటాడడం షురూ చేశారు. మంద బలం చూసుకుని ముందు కొచ్చే రాజును కాను… మొండి ధైర్యంతో.. గుండెను చూపించే మొండోన్ని అంటూ.. తన మార్క్ పంథా ఏంటో జెస్ట్ వన్ మినెట్ 24 సెకండ్స్ టీజర్‌తో.. చూపించేశాడు. అంతే కాదు.. తన బర్త్ డే కానుకగా.. రిలీజ్ అయిన టీజర్‌తో.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాడు. టీజర్ రిలీజ్ అయిన 6 గంటల్లోనే దాదాపు 3 మిలియన్ వ్యూస్ ను వచ్చేలా చేసుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!