TOP 9 ET: రిలీజ్‌కు ముందే.. స్టోరీ లీక్.! | సమంత ఇక సినిమాలకు విరామం..!
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని తెరకెక్కిస్తున్న సినిమా బ్రో. జులై 28న విడుదల కానున్న బ్రో చిత్ర షూటింగ్ తాజాగా పూర్తైంది. ఈ మధ్యే ఆస్ట్రియాకి వెళ్లి అక్కడే ఓ సాంగ్ షూట్ చేసుకొచ్చారు. ఈ షెడ్యూల్‌తోనే మొత్తం షూటింగ్ పూర్తైనట్లుగా హీరో సాయి తేజ్ కన్ఫర్మ్ చేసాడు.
01.Samantha
ఓ వైపు ఖుషీ.. మరోవైపు సిటాడెల్ సిరీస్‌తో బిజీగా ఉన్న సమంత తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమె ఉన్నట్లుండి సినిమాలకు ఏడాది బ్రేక్ ఇవ్వాలని ఫిక్సైపోయారు. ఒప్పుకున్న ఖుషి, సిటాడెల్ పూర్తైన తర్వాత తన ఆరోగ్యం కోసమే ఏడాదికి పైగా బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సమంత. ఇక గత కొన్నాళ్లుగా మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న స్యామ్.. చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఈ ట్రీట్మెంట్ కోసమే ఇపుడు సమంత ఏడాది బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయిందని తెలుస్తుంది.
02.Prabhas
నిన్న మొన్నటి వరకు ఆదిపురుష్ గా అందర్నీ చేతులెక్కి మొక్కేలా చేసుకున్న.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు మాఫియాను ఏలబోయే మాన్‌స్టర్ గా మారిపోయారు. తన లుక్‌తో.. రిలీజ్ కాబోయే టీజర్‌తో.. సెన్సేషన్ క్రియేట్ చేసేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే.. తాజాగా బయటికి వచ్చిన ఈ మూవీ స్టోరీ లైన్‌తో.. ఇప్పుడు హోల్ సోషల్ మీడియానే షేక్ అయ్యేలా చేస్తున్నారు. ఎస్ ! ఆఫ్టర్ కేజీఎఫ్..! ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ను డైరెక్ట్ చేస్తూ… చేస్తున్న ఫిల్మ్ సలార్. మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఫిల్మ్గా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ లైన్ మోస్ట్ ఫేమస్ ఫిల్మ్ బ్లాగ్ అయిన IMBd సైట్లో ప్రత్యక్షమైంది… స్నేహితుడికి ఇచ్చిన ప్రామిస్ కోసం.. మాఫియాను వేడాటే వ్యక్తే సలార్ అనే పాయింట్ ఇప్పుడు అందరికీ కిక్కిస్తోంది.
03.Balagam
తెలంగాణ కల్చర్ నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమా అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఏకంగా వంద ఇంటర్నేషనల్ అవార్డులు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమయ్యారు. కథ మీద నమ్మకంతో దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు.
04. Devil
బింబిసార లాంటి బ్లాక్ బస్టర్‌తో గతేడాది అదరగొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్.. మరో డిఫరెంట్ సబ్జెక్టుతో వస్తున్నారు. డెవిల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తుంది డెవిల్. స్వాతంత్రం రాక ముందు బ్రిటిషర్లకు సీక్రెట్ ఏజెంట్‌గా పని చేసే సీక్రెట్ ఏజెంట్ డెవిల్‌గా నటిస్తున్నారు కళ్యాణ్ రామ్. సినిమా త్వరలోనే విడుదల కానుంది.
05.BRO
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని తెరకెక్కిస్తున్న సినిమా బ్రో. జులై 28న విడుదల కానున్న బ్రో చిత్ర షూటింగ్ తాజాగా పూర్తైంది. ఈ మధ్యే ఆస్ట్రియాకి వెళ్లి అక్కడే ఓ సాంగ్ షూట్ చేసుకొచ్చారు. ఈ షెడ్యూల్‌తోనే మొత్తం షూటింగ్ పూర్తైనట్లుగా హీరో సాయి తేజ్ కన్ఫర్మ్ చేసాడు. ఈ సినిమా బిజినెస్ కూడా నెక్ట్స్ లెవల్‌లో జరుగుతుంది. తమిళ సినిమా వినోదీయ సితమ్‌కు రీమేక్‌గా వస్తుంది బ్రో.
06. Kushi
విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఖుషి. శివా నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. లాస్ట్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
07. VT 13
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఏరియల్ యాక్షన్ డ్రామా వీటీ 13. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయ్యింది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించారు. ఇప్పటికే టైటిల్ ఫిక్స్ చేశామని త్వరలోనే ఆ టైటిల్‌ను ఎనౌన్స్ చేస్తామన్నారు మేకర్స్. ఈ సినిమాలో మాజీ మిస్ ఇండియా మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
08.Kamal Haasan
విక్రమ్ సక్సెస్ తరువాత జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ప్రజెంట్ ఇండియన్ 2 వర్క్‌లో బిజీగా ఉన్న కమల్, ప్రాజెక్ట్ కే, తో పాటు మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ తరువాత హెచ్ వినోద్ దర్శత్వంలో మరో మూవీ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. ఈ సినిమాను కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తున్నారు.
09.Shahrukh Khan
కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ షూటింగ్‌లో గాయపడినట్టుగా జరుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది. ఇంక అఫీషియల్‌గా ఎనౌన్స్ కానీ ఓ సినిమా షూటింగ్‌లో షారూఖ్ గాయపడ్డారని, మైనర్ సర్జరీ కూడా జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ బుధవారం ఉదయం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాల కంటపడ్డారు షారూఖ్. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...