Nithya Menen: లవ్ ఫెయిల్ అబ్బాయిలకేనా.? అమ్మాయిలు కాకూడదా.? ప్రశ్నిస్తున్న నిత్యా మీనన్.
ఎప్పుడూ అబ్బాయిలే లవ్‌లో ఫెయిల్ అవ్వాలా? ఏం అమ్మాయిలు కాకూడదా? రిలేషన్‌షిప్స్ గురించి అమ్మాయిలకు ఒపీనియన్ ఉండకూడదా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు బెంగుళూరు బ్యూటీ నిత్యామీనన్. ఉన్నట్టుండి ఈ బ్యూటీకి ఇన్ని డౌట్స్ ఎందుకు వస్తున్నాయని అంటారా? దానికి కారణం లేకపోలేదు. సూటిగా.. సుత్తిలేకుండా మాట్లాడటం తనకు అలవాటు అంటున్నారు నిత్యా.
ఎప్పుడూ అబ్బాయిలే లవ్‌లో ఫెయిల్ అవ్వాలా? ఏం అమ్మాయిలు కాకూడదా? రిలేషన్‌షిప్స్ గురించి అమ్మాయిలకు ఒపీనియన్ ఉండకూడదా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు బెంగుళూరు బ్యూటీ నిత్యామీనన్. ఉన్నట్టుండి ఈ బ్యూటీకి ఇన్ని డౌట్స్ ఎందుకు వస్తున్నాయని అంటారా? దానికి కారణం లేకపోలేదు. సూటిగా.. సుత్తిలేకుండా మాట్లాడటం తనకు అలవాటు అంటున్నారు నిత్యా. కథలు నచ్చినా, నచ్చకపోయినా మొహమాటానికి అస్సలు సినిమాలు చేసే అలవాటు తనకు లేదట. తనతోపాటు ఎంతమంది హీరోయిన్లు స్ర్కీన్ షేర్ చేసుకున్నా డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ నిత్యా సొంతం. ఏదైనా డిఫరెంట్ కంటెంట్ ఉంటేనే ఆ సినిమాకు సైన్ చేస్తారు నిత్యా. అందుకే తన ఖాతాలో చాలా తక్కువ సినిమాలు ఉంటాయి. ఆచితూచి సినిమాలు సెలక్ట్ చేసుకోవడం ఓ కళ అని అంటారు నిత్య. లేటెస్ట్ గా ఆమె ఓ సినిమాకు సైన్ చేశారు. అందులో లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయిగా కనిపిస్తారు. రిలేషన్‌షిప్స్ ని నేటి తరం అమ్మాయిలు ఎలా చూస్తున్నారన్న విషయం మీద ఈ సినిమాలో డిస్కషన్ ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే, ఇప్పుడు చాలా మంది సెన్సిటివ్ సబ్జెక్టులతో వస్తున్నారన్నది నిత్య అభిప్రాయం. మంచి కంటెంట్ ఉన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తనకెలాంటి ఇబ్బందీ లేదంటారు నిత్యా. థియేట్రికల్ రిలీజ్ అయినా, డిజిటల్ స్ట్రీమింగ్ అయినా పట్టించుకోరు.. ఇక లాంగ్వేజ్ బేరియర్స్ అసలే లేవన్నది మొదటి నుంచి నిత్య ఫిలాసఫీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.