Hanuman: ఓటీటీలోనూ సత్తా చాటుతున్న హనుమాన్ మూవీ.! ట్రెండింగ్‌లో నెం.1.
2024 సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. పెద్దసినిమాల మధ్య చిన్న సినిమాగా ఆచితూచి విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇటీవలే హనుమాన్ ఓటీటీలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్దే కాదు, ఓటీటీలోనూ హనుమాన్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా మార్చి 16 నుంచి జియో సినిమాలో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా,
2024 సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. పెద్దసినిమాల మధ్య చిన్న సినిమాగా ఆచితూచి విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇటీవలే హనుమాన్ ఓటీటీలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్దే కాదు, ఓటీటీలోనూ హనుమాన్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా మార్చి 16 నుంచి జియో సినిమాలో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా, ఆ మరుసటి రోజే జీ5 ఓటీటీలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ‘హను-మాన్’ రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 11 గంటల కన్నా తక్కువ సమయంలోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను నమోదు చేసింది. 2024లో విడుదలైన సినిమాల్లో ఈ స్థాయి క్రేజ్‌ను సొంతం చేసుకున్న చిత్రం మరొకటి లేదంటూ జీ5 సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది. అంతేకాదు, గ్లోబల్ ట్రెండింగ్‌లో నెం.1 పొజిషన్‌లో ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో తేజ సజ్జ, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితరులు నటించిన ఈ మూవీ సీక్వెల్ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టారు. త్వరలోనే ఇది పట్టాలెక్కనుంది. ఇందులో హనుమంతుడే సూపర్ హీరోగా కనిపించనున్నట్లు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఆ పాత్ర కోసం స్టార్ హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ టాక్. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.