Jagapathi Babu: గుంటూరు కారంపై జగపతిబాబు అనాలసిస్.! ఏమన్నారంటే.?
తాజాగా ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడిన జగపతిబాబు.. సినిమాపై తన రివ్యూ చెప్పారు. సినిమాలో పాత్రల గురించి మాట్లాడారు. తన పాత్ర వరకు తాను బాగానే చేశానని అన్నారు. ఇక మహేశ్‌బాబుతో కలిసి పనిచేయడం తనకు ఎప్పుడూ ఇష్టమేనన్నారు. మహేశ్ సినిమాల్లో ఏ అవకాశాన్నీ తాను వదులుకోనని వివరించారు. మహేశ్ తో ‘శ్రీమంతుడు’ తనకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు.
సంక్రాంతికి విడుదలైన మహేశ్‌బాబు సినిమా గుంటూరు కారం సినిమాను సినీ నటుడు జగపతిబాబు అనాలసిస్ చేశారు. ఈ సినిమా తనకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చిందో చెప్పారు. గుంటూరు కారం సినిమాలో ఆయన విలన్ క్యారెక్టర్ లో నటించారు. తాజాగా ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడిన జగపతిబాబు.. సినిమాపై తన రివ్యూ చెప్పారు. సినిమాలో పాత్రల గురించి మాట్లాడారు. తన పాత్ర వరకు తాను బాగానే చేశానని అన్నారు. ఇక మహేశ్‌బాబుతో కలిసి పనిచేయడం తనకు ఎప్పుడూ ఇష్టమేనన్నారు. మహేశ్ సినిమాల్లో ఏ అవకాశాన్నీ తాను వదులుకోనని వివరించారు. మహేశ్ తో ‘శ్రీమంతుడు’ తనకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ తాను కొన్ని అనవసరమైన సినిమాలు చేశానని, కథను ఎంచుకోవడంలో పొరపాట్లు చేశానని పేర్కొన్నారు. తనకు కమర్షియల్ మైండ్ లేదన్నారు. ఈ తరహా సినిమాలే చేయాలన్న హద్దులేమీ లేవన్నారు. ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చేశానని, అలా చేయకపోయి ఉంటే నేడు ఇంకా మంచి స్థానంలో ఉండేవాడినని, అయినా, అందుకు తానేమీ బాధపడడం లేదని జగపతిబాబు చెప్పుకొచ్చారు. ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాలోనూ నటిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.