రష్మిక డీప్ ఫేక్ వీడియో.. నలుగురు అరెస్ట్
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీతారలు డీప్ ఫేక్ వీడియోస్ వైరలవుతున్నాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను టార్గెట్ చేశారు కొందరు. మొన్నటి వరకు ఆమెకు సంబంధించిన బ్లాక్ డ్రెస్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వీడియో చక్కర్లు కొట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ సాయంతో రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై రష్మికతోపాటు సినీ పరిశ్రమలోని ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ సీరియస్ అయ్యారు.
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీతారలు డీప్ ఫేక్ వీడియోస్ వైరలవుతున్నాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను టార్గెట్ చేశారు కొందరు. మొన్నటి వరకు ఆమెకు సంబంధించిన బ్లాక్ డ్రెస్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వీడియో చక్కర్లు కొట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ సాయంతో రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై రష్మికతోపాటు సినీ పరిశ్రమలోని ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ సీరియస్ అయ్యారు. రష్మిక తర్వాత అలియా భట్, కత్రీనా కైఫ్ లాంటి హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోస్ సైతం వైరలయ్యాయి. అయితే ఈ వీడియోస్ అన్ని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాయంతో చేసినట్లు గుర్తించారు. ఇలాంటి మార్ఫింగ్ వీడియోస్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు, ప్రముఖులు డిమాండ్ చేశారు. రష్మిక డీప్ ఫేక్ వీడియో ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఆ నలుగురు ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. అయితే నకిలీ వీడియోను తయారు చేసింది మాత్రం వీరు కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వీడియోను సృష్టించిన సృష్టికర్తల కోసం వెతుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pallavi Prashanth: పోలీసులకు దొరకకుండా పారిపోయిన రైతుబిడ్డ
Rishab Shetty: గ్రేట్ !! రియల్ హీరో అనిపించుకున్న రిషబ్
Shruti Haasan: రోజూ మందు పార్టీ.. తప్పుచేశానంటూ బాధపడ్డ శృతి
Pallavi Prashanth: నేనూ మనిషినే.. ఎందుకిట్ల చేస్తుండ్రు.. గరం అయిన రైతుబిడ్డ
Ritu Chaudhary: నా వీడియోలు వైరల్ చేస్తున్నారు.. రీతూ ఎమోషనల్