Samantha: మళ్లీ పెళ్లా.? అదొక.. అంటూ సమంత రియాక్షన్‌.! దేవుడిపై నమ్మకం ఉందన్న సమంత.

Samantha: మళ్లీ పెళ్లా.? అదొక.. అంటూ సమంత రియాక్షన్‌.! దేవుడిపై నమ్మకం ఉందన్న సమంత.

Anil kumar poka

|

Updated on: Dec 21, 2023 | 8:05 PM

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో బిజీబిజీగా మారిపోయారు. మరోవైపు అనారోగ్య సమస్యలతోనూ చాలా ఇబ్బంది పడ్డారు. విదేశాలలో చికిత్స తర్వాత కోలుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్ కు తాజాగా ఓ నెటిజన్ నుంచి రెండో పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. వీకెండ్ సందర్భంగా ఆస్క్ మీ అంటూ సమంత సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో.. మీరు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు.?

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో బిజీబిజీగా మారిపోయారు. మరోవైపు అనారోగ్య సమస్యలతోనూ చాలా ఇబ్బంది పడ్డారు. విదేశాలలో చికిత్స తర్వాత కోలుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్ కు తాజాగా ఓ నెటిజన్ నుంచి రెండో పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. వీకెండ్ సందర్భంగా ఆస్క్ మీ అంటూ సమంత సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో.. మీరు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ? అంటూ ఓ అభిమానినుంచి ఎదురైన ప్రశ్నకు సామ్ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. 2023 లో విడాకుల వివరాలను కోట్ చేస్తూ.. రెండో పెళ్లి అనేది బ్యాడ్ ఇన్వెస్ట్ మెంట్ అని చెప్పారు.

కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అంటూ సమంత ఓ ఇమేజ్ తో అభిమానికి జవాబిచ్చారు. అధికారిక గణాంకాల ప్రకారం.. మొదటి పెళ్లి విడాకుల శాతం 50 శాతం అయితే, రెండు, మూడోసారి పెళ్లి చేసుకున్నవారిలో కూడా 73 శాతం మంది మళ్లీ విడిపోతున్నారని పేర్కొన్నారు. స్త్రీ పురుషులు ఇద్దరి విషయంలోనూ ఇలాగే ఉందని సామ్ అభిప్రాయపడ్డారు. అందుకే, ఆ ఆలోచన బ్యాడ్ ఇన్వెస్ట్ మెంట్ కిందికి వస్తుందని వివరించారు. మరో అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబుగా.. తనకు దేవుడిపై నమ్మకం ఉందని సామ్ తెలిపారు. అంతేకాదు.. మీ రోజువారీ దినచర్యలోనే మీ విజయ రహస్యం దాగి ఉంటుంది అంటూ కోట్ చేసారు. కాగా, సామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.